ప్రజాగళం బహిరంగ సభలో అమిత్ షా, చంద్రబాబు..
ABN, Publish Date - May 06 , 2024 | 12:11 PM
శ్రీసత్యసాయి జిల్లా: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి జగన్మోహన్ రెడ్డి అవినీతే కారణమని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా పేర్కొన్నారు. అవినీతి, అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకే టీడీపీ, జనసేనతో బీజేపీ కూటమిగా ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు... కేంద్రంలో మోదీ సర్కార్ వస్తే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘ప్రజాగళం’ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. జగన్ పాలనపై అమిత్‌షా మండిపడ్డారు.
సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆదివారం జరిగిన ప్రజాగళం సభకు విచ్చేసిన కేంద్ర హోమంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం.
సత్యసాయి జిల్లా, ధర్మవరం ప్రజాగళం సభలో ప్రసంగిస్తున్న కేంద్ర హోమంత్రి అమిత్ షా
సత్యసాయి జిల్లా, ధర్మవరం ప్రజాగళం సభలో ప్రసంగిస్తున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు.
ధర్మవరం ప్రజాగళం సభ వేదికపై ముచ్చటించుకుంటున్న కేంద్ర హోమంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
సత్యసాయి జిల్లా, ధర్మవరం ప్రజాగళం సభ వేదికపై చేయీ చేయి కలుపుకున్న కూటమి నేతలు..
టీడీపీ అధినేత చంద్రబాబు ధర్మవరంలో నిర్వహించిన ప్రజాగళం సభకు భారీగా తరలి వచ్చిన ప్రజలు..
సత్యసాయి జిల్లా, ధర్మవరం ప్రజాగళం సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అమిత్ షాకు టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహూకరిస్తున్న దృశ్యం.
Updated Date - May 06 , 2024 | 12:11 PM