ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kutami: పాయకరావుపేట, గాజువాకలో చంద్రబాబు ప్రజాగళం

ABN, Publish Date - Apr 15 , 2024 | 12:42 PM

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా ఆదివారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, విశాఖ జిల్లా గాజువాకల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. తొలుత పాయకరావుపేటలో జరిగిన ప్రజాగళం సభకు జనం పోటెత్తారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మధ్యాహ్నం నుంచి నక్కపల్లి, కోటవురట్ల, ఎస్‌.రాయవరం మండలాల నుంచి భారీగా జనం కదలి వచ్చారు. పాయకరావుపేటలో మంగవరం రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్ద చంద్రబాబునాయుడుకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి గెడ్డం బుజ్జి, తోట నగేశ్‌, స్థానిక నేతలు చంద్రబాబుకు పూలబొకేలు అందించి ఘన స్వాగతం పలికారు.

1/8

టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఆదివారం అనకాపల్లి జిల్లా, పాయకరావుపేటలో జరిగిన ప్రజాగళం సభకు విచ్చేసిన సందర్బంగా కమలం, సైకిల్ గుర్తులను చూపిస్తున్న దృశ్యం.

2/8

పాయకరావుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.

3/8

అనకాపల్లి కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ పాయకరావుపేట బహిరంగ సభలో ప్రసంగిస్తున్న దృశ్యం. ప్రక్కన చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత తదితరులు..

4/8

అనకాపల్లి జిల్లా, పాయకరావుపేటలో జరిగిన ప్రజాగళం సభకు విచ్చేసిన చంద్రబాబుకు కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు గజమాలతో సన్మానిస్తున్న దృశ్యం.

5/8

పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం. ప్రక్కన చంద్రబాబు, బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌లను చూడవచ్చు.

6/8

విశాఖపట్నం, గాజువాకలో ఆదివారం రాత్రి జరిగిన ప్రజాగళం బహిరంగ సభకు విచ్చేసిన ప్రజలకు విక్టరీ సంకేతం చూపుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.

7/8

గాజువాక ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

8/8

విశాఖపట్నం, గాజువాకలో ఆదివారం రాత్రి చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలి వచ్చిన జనం..

Updated Date - Apr 15 , 2024 | 12:42 PM

Advertising
Advertising