Tirumala: జగన్‌కు వ్యతిరేకంగా తిరుమలలో నిరసనలు..

ABN, Publish Date - Sep 27 , 2024 | 12:18 PM

తిరుపతి: తిరుపతి లడ్డూ అపవిత్రం చేసిన వ్యవహారం కాక రేపుతుండగానే... మాజీ సీఎం జగన్‌ తిరుమలకు వస్తుండటం మరింత మంట రాజేస్తోంది. ఐదేళ్లుగా తన చేష్టలు, లడ్డూ కల్తీపై తన మాటలతో హిందూ భక్తుల మనోభావాలు గాయపరిచిన జగన్‌ను తిరుపతిలో అడుగు పెట్టనీయబోమని హిందూ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన జగన్‌ కొండకు రాకూడదంటూ బీజేపీ, హిందూ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. డిక్లరేషన్‌ ఇచ్చిన తర్వాతే తిరుమలలో స్వామిని దర్శించుకోవాలని కూటమి పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Tirumala: జగన్‌కు వ్యతిరేకంగా తిరుమలలో నిరసనలు.. 1/6

జగన్ తిరుపతికి రావద్దంటూ అలిపిరి గరుడ విగ్రహం వద్ద గో బ్యాక్ క్రిస్టియన్ జగన్ అంటూ నిరసన వ్యక్తం చేస్తున్న స్వామీజీలు, సాధువులు..

Tirumala: జగన్‌కు వ్యతిరేకంగా తిరుమలలో నిరసనలు.. 2/6

తిరుపతి టీటీడీ పరిపాలన భవనం ముందు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి, తదితరులు..

3/6

శ్రీవారి మెట్లు మార్గాన తిరుమలకు వెళ్తున్న బీజేపీ నాయకురాలు మాధవి లత..

4/6

జగన్ డిక్లరేషన్‌ ఇచ్చిన తర్వాతే తిరుమలలో స్వామిని దర్శించుకోవాలని కూటమి పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి...

5/6

ఎమ్మెల్యే జనగ్‌కు వ్యతిరేకంగా నిలసన తెలుపుతున్న బీజేపీ నేతలు..

6/6

టీటీడీ ఈవో శ్యామలరావుతో మాట్లాడుతున్న బీజేపీ బీజేపీ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి, తదితరులు..

Updated Date - Sep 27 , 2024 | 12:18 PM