AP.. మంత్రుల ప్రమాణస్వీకారం దృశ్యాలు
ABN , Publish Date - Jun 12 , 2024 | 01:27 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. విజయవాడలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ జనసందోహం మధ్య చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు పలువురు కూటమి నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆ దృశ్యాలు..
భయంగానీ, పక్షపాతం లేకుండా ప్రజలకు న్యాయం చేకూరుస్తానని టీడీపీ నేతల వంగలపూడి అనిత మంత్రిగా ప్రమాణం చేశారు.
తన బాధ్యతను అంతఃకరణ శుద్దితో నిర్వహిస్తానని సత్యకుమార్ యాదవ్ మంత్రిగా ప్రమాణం చేశారు.
శాసనం ద్వార నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని పేర్కొంటూ నిమ్మల రామానాయుడు మంత్రిగా ప్రమాణం చేశారు.
తన కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని పేర్కొంటూ మంత్రిగా ఎన్ఎండీ ఫరూక్ ప్రమాణం చేశారు.
రాగద్వేషాలకు తావులేకుండా రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజలకు న్యాయం చేస్తానని పేర్కొంటూ ఆనం రామనారాయణ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు.
భారత రాజ్యాంగపట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానంటూ పయ్యావుల కేశవ్ మంత్రిగా ప్రమాణం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా తన కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్దితో నిర్వహిస్తానని అనగాని సత్యప్రసాద్ మంత్రిగా ప్రమాణం చేశారు.
ఆంధ్రపదేశ్ మంత్రిగా తన కర్తవ్యాలను శ్రద్ధతో నిర్వహిస్తానని కొలుసు పార్థసారధి ప్రమాణం చేశారు.
తన కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని పేర్కొంటూ మంత్రిగా బాల వీరాంజనేయస్వామి ప్రమాణం చేశారు.
కూటమిలో భాగంగా గొట్టిపాటి రవికుమార్ ఆంధ్రపదేశ్ మంత్రిగా ప్రమాణం చేశారు.
రాగద్వేషాలకు తావులేకుండా రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజలకు న్యాయం చేస్తానని పేర్కొంటూ కందుల దుర్గేష్ మంత్రిగా ప్రమాణం చేశారు.
ఆంధ్రపదేశ్ మంత్రిగా తన కర్తవ్యాలను శ్రద్ధతో నిర్వహిస్తానని గుమ్మడి సంధ్యారాణి ప్రమాణం చేశారు.
భారత రాజ్యాంగపట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానంటూ బీసీ జనార్ధన్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు.
ఆంధ్రపదేశ్ మంత్రిగా తన కర్తవ్యాలను శ్రద్ధతో నిర్వహిస్తానని టీజీ భరత్ ప్రమాణం చేశారు.
తన కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని పేర్కొంటూ మంత్రిగా ఎస్ సవిత ప్రమాణం.
భయంగానీ, పక్షపాతం లేకుండా ప్రజలకు న్యాయం చేస్తానని కొండపల్లి శ్రీనివాస్ ప్రమాణం.
భారత రాజ్యాంగపట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానంటూ మండిపల్లి రాంప్రసాద్ ప్రమాణం.
Updated Date - Jun 12 , 2024 | 01:58 PM