Warangal: అట్టహాసంగా నరకాసుర వధ
ABN, Publish Date - Oct 31 , 2024 | 10:55 AM
కరీమాబాద్: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరంలోని ఉర్సు గుట్ట కుడా మైదానంలో బుధవారం నరకాసుర వధ కన్నుల పండువగా సాగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు అద్యంతం వైభవంగా కొనసాగాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మరుపల్ల రవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, భద్రం దేవాలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరంలోని ఉర్సు గుట్ట కుడా మైదానంలో బుధవారం నరకాసుర వధ కన్నుల పండువగా సాగింది.

వరంగల్ ఊర్సుగుట్ట వద్ద నరకాసుర వధ.. అలరించిన ప్రత్యేక బాణసంచా విన్యాసాలు..

నరకాసుధ వధ ఘట్టం.. ప్రత్యేక బాణసంచా వెలుగులు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి...

ఉర్సు గుట్ట వద్ద జరిగిన ఉత్సవానికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు..

కళ్లు చెదిరేలా.. ఘనంగా నిర్వహించిన ఉర్సు గుట్ట వద్ద నరకాసుర వధ వేడుకలు..

ఉర్సు గుట్ట వద్ద నరకాసుర వధ వేడుకలు.. కిక్కిరిసిపోయిన గుట్ట మైదానం..
Updated at - Oct 31 , 2024 | 10:55 AM