CM Revanth Reddy: పాలమూరు జిల్లాపై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Nov 10 , 2024 | 05:28 PM
పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవాలని కొందరు చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ పాలనలోనైనా పాలమూరును అభివృద్ధి చేసుకోనివ్వండంటూ ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్బంగా సూచించారు. ఈ జిల్లా 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒక సీఎంను ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
పాలమూరు జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్‌లోని కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రూ.110 కోట్లతో ఆలయ ఘాట్ రోడ్డు కారిడార్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటికీ కురుమూర్తి ఆలయంలో మౌలిక సదుపాయాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కురుమూర్తి ఆలయానికి ఏం కావాలో కలెక్టర్ నివేదిక ఇస్తే నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పేదల తిరుపతిగా కురుమూర్తి ఆలయాన్ని కొలుస్తారని ఆయన చెప్పారు.
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పాలమూరులో ప్రాజెక్టులు సైతం పూర్తి కాలేదని సీఎం అన్నారు. పాలమూరుకు విద్య, వైద్యం, ఉపాధి కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో జిల్లాకు పరిశ్రమలు, ప్రాజెక్టులు రాలేదని, ఈ ప్రాంతంలో ఇంకా వలసలు కొనసాగుతూనే ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవాలని కొందరు చూస్తున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పటికైనా తమ పాలనలో పాలమూరును అభివృద్ధి చేసుకోనివ్వాలంటూ ప్రతిపక్షాలకు ఆయన సూచించారు.
పాలమూరు జిల్లా 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒక సీఎంను ఇచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా రుణం తీర్చుకుంటామని సీఎం స్పష్టం చేశారు.
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పాలమూరుకు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు బిడ్డనై ఉండి.. ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ప్రజలు తనను క్షమించరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పాలమూరు యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. తమ పరిశ్రమలో 2 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని అమర్‌రాజా సంస్థ హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు.
జిల్లాలో గ్రామ గ్రామానికి, తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత తనదని రేవంత్ చెప్పారు. ఈ సందర్భంగా బీటీ రోడ్ల నిర్మాణాలకు అంచనాలు తయారు చేయాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Updated Date - Nov 10 , 2024 | 05:34 PM