హైదరాబాద్: భాగ్యనగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేకుండా వాన కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రెడ్ అలర్టు ప్రకటించారు. అవసరం అయితే తప్ప ప్రజలు ఎవరూ బయకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా నగరంలోని మూసారంబాగ్ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి మూసికి వరద పోటెత్తుతోంది.