వరద బాధితుల కోసం సీఎంఆర్ఎఫ్‌కు భారీ విరాళాలు..
ABN , Publish Date - Sep 10 , 2024 | 06:49 PM
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు సీఎంఆర్ఎఫ్ నిధికి పెద్దఎత్తున విరాళాలు వస్తున్నాయి. సీఎం సహాయనిధికి లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ రూ.కోటి ప్రకటించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కు అందజేశారు. అలాగే మైత్రా ఎనర్జీ గ్రూప్ అండ్ అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు విక్రమ్ కైలాస్, రవి కైలాస్ రూ.కోటి చెక్కును సీఎంకు అందజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు సీఎంఆర్ఎఫ్ నిధికి పెద్దఎత్తున విరాళాలు వస్తున్నాయి.
వరద బాధితుల సహాయార్థం ప్రముఖ వ్యాపారవేత్త రవి రహేజా సీఎం సహాయనిధికి రూ.5కోట్ల భారీ విరాళం ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కు అందజేశారు.
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెట్ ప్రతినిధులు రూ.2.5కోట్ల చెక్కును సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందించారు.
తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ.కోటి విరాళం ప్రకటించారు.
అలాగే మైత్రా ఎనర్జీ గ్రూప్ అండ్ అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు విక్రమ్ కైలాస్, రవి కైలాస్.. ముఖ్యమంత్రిని కలిసి రూ.కోటి చెక్కును అందజేశారు.
లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ సైతం తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి విరాళానికి సంబంధించిన రూ.కోటి చెక్కును అందజేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ఎస్టేట్ డెవలపర్స్ సంఘాల సమాఖ్య క్రెడాయ్ రూ.కోటి విరాళం అందించింది.
వరద బాధితుల కోసం ప్రముఖ నిర్మాత, నటి సుప్రియ యార్లగడ్డ భారీ విరాళం ప్రకటించారు. ఈ మేరకు రూ.50లక్షల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.
కెమిలాయిడ్స్, అపోలో ఆస్పత్రి, శ్రీచైతన్య విద్యాసంస్థల యాజమాన్యం, విర్కో ఫార్మా, ఆర్.వి.ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థలు రూ.కోటి చొప్పున విరాళం ప్రకటించాయి.
Updated Date - Sep 10 , 2024 | 06:49 PM