ఖమ్మం: నగరంలోని నయాబజార్ కళాశాల వరదల్లో మునగటంతో ఆ కాలేజీని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పరిశీలించారు. ఫైల్స్, కంప్యూటర్లు అన్ని తడిసిపోయాయి. వాటన్నింటిని ఆయన పరిశీలించారు. అనంతరం కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరంలో వరద బాధితులకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. తర్వాత బొక్కల గడ్డ, రాజీవ్ గృహకల్ప తదితర ప్రాంతాలలో పర్యటించి బాధితుల కష్టాలను ప్రత్యక్షంగా చూశారు. ఘటన జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నేరు వరద బాధితులకు ఎంత సహాయం చేసినా అది తక్కువే అవుతుందని కోదండరాం అన్నారు.