ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేతన్నకు అండగా ఉంటాం: మంత్రి తుమ్మల

ABN, Publish Date - Aug 07 , 2024 | 06:57 PM

National Handloom Day 2024: చేనేత రంగం మన దేశపు పురాతన సంపద, సాంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, చేనేత కళను ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి ప్రభుత్వం శాశ్వత పథకాలు చేపట్టనుందని..

1/6

National Handloom Day 2024: చేనేత రంగం మన దేశపు పురాతన సంపద, సాంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, చేనేత కళను ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి ప్రభుత్వం శాశ్వత పథకాలు చేపట్టనుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మరియు వస్త్రాలు శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

2/6

బుధవారం చేనేత జౌళీ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొని చేనేత ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాచీన సంప్రదాయ కళలకు ప్రతిబింబాలైన నేత కళకు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చేందుకు శాశ్వత పథకాలను చేపట్టనున్నామని తెలిపారు.

3/6

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. నేతన్నల అంకితభావం, సృజనాత్మకత దేశానికి గర్వకారణమని అన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి ధరించి నేతన్నకు చేత నివ్వాలని అన్నారు. నేతన్నలకు మేలైన జీవత్యాన్ని ఇంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి చేనేత కళాకారునికి ప్రభుత్వ సహకారం అందాలి అన్నారు.

4/6

నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ప్రపంచంతో పోటీపడే పద్ధతులు నేర్చుకొని నేత ఉత్పత్తులను తయారు చేయాలన్నారు. నేతన్నకు చేయూత పథకం కింద 2024-25 బడ్జెట్‌‌లో రూ. 90 కోట్లు కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు. నేతన్న భీమ ద్వారా రాష్ట్రంలో 36,777 మంది చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులకు లబ్ధి చేకూర్చడం కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 15 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు.

5/6

తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టి) నెలకొల్పడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. నేతన్న భీమా పథకం కింద ఇప్పటివరకు124 డెత్ క్లెయిమ్స్ ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున రూ. 6.20 కోట్లు వారి నామినీ ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు మంత్రి. అనంతరం శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుల కింద 32 మంది నేత/డిజైనర్లకు ప్రతిభా పత్రము, జ్ఞాపిక శాలువాతోపాటు ఒక్కొక్కరికి రూ. 25 వేల నగదు పురస్కారం అందజేశారు.

6/6

ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్ విజయ రెడ్డి, మాజీ డీఐజీ తేజ్ దీప్ కౌర్, రాష్ట్ర పద్మశాలి సంఘ అధ్యక్షులు కందకట్ల స్వామి, మండల శ్రీరాములు, సత్యనారాయణ, మురళి, అరుణ్ కుమార్, వరలక్ష్మి, దుష్యంత్, ఆప్కో మాజీ చైర్మన్లు, పద్మశాలి సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2024 | 07:03 PM

Advertising
Advertising