Peddireddy: పెద్దిరెడ్డికి మరో ఊహించని షాక్..
ABN, Publish Date - Jul 12 , 2024 | 02:41 PM
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వైసీపీ (YSR Congress) అధికారంలో ఉండగా ఎలా వ్యవహరించేవారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..! ఒక్క పుంగనూరు (Punganur) నియోజకవర్గమే కాదు రాయలసీమ మొత్తం రాసిచ్చేశారన్నట్లుగా ప్రవర్తించేవారు..!
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వైసీపీ (YSR Congress) అధికారంలో ఉండగా ఎలా వ్యవహరించేవారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..! ఒక్క పుంగనూరు (Punganur) నియోజకవర్గమే కాదు రాయలసీమ మొత్తం రాసిచ్చేశారన్నట్లుగా ప్రవర్తించేవారు..! సీన్ కట్ చేస్తే ఐదేళ్లలో జీరో అయ్యారు..! అలాంటిది ఒక్కసారిగా వైసీపీ ఘోర ఓటమిని చవిచూడటం.. అందులోనూ మంత్రులందరిలో ఈయన ఒక్కడే అది కూడా అంతంత మాత్రం మెజార్టీతోనే..! దీంతో ఇప్పుడు అసలు రూపం బయటపడుతోంది..! వైసీపీ ఓడిపోయినా సరే పెద్దిరెడ్డి చేసే అరాచకాలు ఆగట్లేదన్నది ప్రధాన ఆరోపణ..! దీంతో పాటు మాజీ మంత్రి ప్రవర్తన నచ్చక ఒక్కొక్కరుగా వైసీపీ నుంచి జారుకుంటున్నారు..!
ఏం జరిగింది..?
ఇప్పటికే పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీంబాషాతో పాటు 12 మంది కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీరంతా టీడీపీ నేత చల్లా బాబును కలిసి.. పార్టీలో చేరికపై చర్చించారు. దీంతో పెద్దిరెడ్డి పెద్ద షాక్ తగిలినట్లయ్యింది. పేరుకే తమకు పదవులు కట్టబెట్టి పెత్తనం మాత్రం ఆయనే చేశారని కౌన్సిలర్లు సంచలన ఆరోపణలే చేశారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. ఈ షాక్ నుంచి తేరుకోక ముందే మరో బిగ్ షాక్ తగిలింది.
ఒక్కొక్కరుగా..!
పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం జడ్పీటీసీ మురళితో సహా నలుగురు ఎంపీటీసీలు, 10మంది సర్పంచులు వైసీపీ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. వారంతా ఈ రాజీనామా లేఖలను జిల్లా అధికారులకు అందజేశారు. ఈ పరిణామంతో పుంగనూరు గడ్డా.. పెద్దిరెడ్డి అడ్డా అని చెప్పుకునే మాజీ మంత్రిగా దిమ్మతిరిగే షాక్ తగిలినట్లయ్యింది. రాజీనామా చేసిన వీరంతా త్వరలోనే టీడీపీ కండువాలు కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే.. లోకల్ బాడీలో, నియోజకవర్గంలో ద్వితియ శ్రేణి నేతలు అనేవారే ఉండరని రాజీనామాలు చేసేసి పార్టీలు జంప్ చేయడానికే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయని స్థానిక నేతలు చెబుతున్నారు.
Updated Date - Jul 12 , 2024 | 02:41 PM