Elections 2024: ఎన్నికల ముందు రోజా బిగ్ షాక్.. గెలుపు కష్టమేనా..!?
ABN, Publish Date - May 03 , 2024 | 06:02 PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. పట్టుమని పదిరోజులు కూడా సమయం లేకపోవడంతో అభ్యర్థులు అస్త్రాలను బయటికి తీస్తున్నారు. అయితే.. అదేంటో కానీ మంత్రి రోజాపై మాత్రం సొంత పార్టీ నేతలే రివర్స్ అవుతున్నారు. అంటే.. రోజాపైనే సొంత మనుషులు రివర్స్ అస్త్రాలు వదులుతున్నారన్న మాట!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. పట్టుమని పదిరోజులు కూడా సమయం లేకపోవడంతో అభ్యర్థులు అస్త్రాలను బయటికి తీస్తున్నారు. అయితే.. అదేంటో కానీ మంత్రి రోజాపై (Minister Roja) మాత్రం సొంత పార్టీ నేతలే రివర్స్ అవుతున్నారు. అంటే.. రోజాపైనే సొంత మనుషులు రివర్స్ అస్త్రాలు వదులుతున్నారన్న మాట! అలా ఉంది నగరి నియోజకవర్గంలో పరిస్థితి. గత ఎన్నికల్లో రోజా గెలిచిన నాటి నుంచి నేటి వరకూ నియోజకవర్గంలో సొంత మనుషులే తిరుగుబాటు చేయడం.. జిల్లా మంత్రులు, ఆఖరికి సీఎం వైఎస్ జగన్ రెడ్డి దగ్గరికి పంచాయితీ ఇవన్నీ నడిచాయి. కానీ ఎన్నికల ముందు తాము అనుకున్నట్లే ఐదు మండలాల వైసీపీ కీలక నేతలు రాజీనామాలు చేసేశారు. అంతేకాదు.. టీడీపీలో చేరుతున్నట్లు సంచలన ప్రకటన చేసేశారు. దీంతో రోజాకు బిగ్ షాక్ తగిలినట్లయ్యింది. రోజాకు ఫుల్ సపోర్టుగా ఉన్న నేతలు వైసీపీని వీడుతుండటంతో గెలుపు కష్టమేనన్న చర్చ సొంత పార్టీ నేతల్లో నడుస్తోందట.
అసలేం జరిగింది..?
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన కీలక నేతలు రాజీనామా చేసేశారు. ఇందులో మాజీ శ్రీశైలం బోర్డు చైర్మన్, సీనియర్ నేత రెడ్డివారి చక్రపాణి రెడ్డి, లక్ష్మిపతిరాజు, మురళీ రెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు. మరోవైపు.. రోజా పెట్టిన కష్టాలు, అవమానాలను భరించలేక ఇద్దరు ఎంపీటీసీలు రెడ్డివారి భాస్కర్ రెడ్డి , విజయ కూడా రాజీనామా చేశారు. ఇంతటితో ఆగలేదు.. 6 మంది సర్పంచులు తులసి రెడ్డి, గోపి, ప్రభాకర్, సంపూర్ణ, జయమ్మ, మనోహర్ నాయుడు కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు. ఈ నేతలంతా రోజాపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న వారే. ఐరన్ లెగ్‌గా ఉన్న రోజా.. ఈ రోజు తమ వల్లనే గోల్డన్ లెగ్ అయ్యిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు నేతలు. రాజీనామాలు ఇంతటితో ఆగవని.. కొనసాగింపు ఉంటుందని ఆదివారం నాడు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
తిట్టిపోసేశారుగా..!
‘నగరి చంద్రముఖిగా నియోజకవర్గాన్ని రోజా ఆవహించింది. నగరి ప్రజల ఆస్తులకు రక్షణ కోసం రోజాను నగిరి నుంచి తరిమి తరిమి కొట్టడానికి నగిరి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నగిరిలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు రెండు వేల ఎకరాలు సేకరింపజేశారు.. దురదృష్టవసాత్తు ఆ పార్టీ రాలేదు. మా పార్టీ అధికారంలోకి వచ్చింది. పరిశ్రమల చైర్మన్ గా పరిశ్రమల కోసం కృషి చేయాల్సిన రోజా.. ఆమె సోదరులు కోట్ల రూపాయల కమిషన్లు తీసుకుని ఆ విలువైన స్థలాన్ని టీటీడీ వారికి ఇచ్చేశారు. రోజా, ఆమె కుటుంబ సభ్యుల అవినీతిపై రాబోయే ప్రభుత్వం విచారణ చేయించాలి. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు కూడా రెండు లక్షల నుంచి ఐదు లక్షలు తీసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా 10 శాతం కమిషన్ తీసుకున్నారు. బదిలీ చేసినా.. అప్రూవల్ చేసినా డబ్బులు ఇవ్వాల్సిందే. ఇసుక, మట్టి గురించి అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. అంతా దోపిడీనే. మేం చెప్పింది అక్షరాలా నిజమని.. అవసరమైతే కాణిపాకంలో ప్రమాణం చేయటానికి సిద్ధం ఉన్నాం. రోజా కాణిపాకం వస్తారా..?. రోజా అభ్యర్థిగా వద్దని హైకమాండ్‌కు పదే పదే చెప్పినా వినలేదు. ఇప్పుడేమో నామినేషన్ కూడా విత్ డ్రాకు సమయం కూడా అయిపోయింది. బ్లాక్ మెయిల్ చేసి రోజా టిక్కెట్టు తెచ్చుకున్నారు. రోజా అభ్యర్థని తేలడంతో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ ఎన్నికల్లో నగరి నుంచి రోజాను గెలిపిస్తే ఆమె, ఆమె కుటుంబంలోని వారి భార్య పిల్లలు కూడా బ్రోకర్లుగా తయారవుతారు. పెద్దిరెడ్డి మాకు సపోర్టు అని రోజా అంటున్నారు.. మరీ ఆయన సపోర్టు ఉంటే మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేస్తారు?’ అని రాజీనామా చేసిన నేతలు.. రోజా బాగోతం బయటపెట్టారు. చూశారుగా.. నగరి నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి. నేతల రాజీనామాలు ఈ ఎన్నికల్లో గట్టిగానే ప్రభావం చూపుతాయని.. రోజాను ఓడించినా ఆశ్చర్యపోనక్కర్లేదని నగరిలో టాక్ నడుస్తోందట.
Read Latest AP News And Telugu News
Updated Date - May 03 , 2024 | 07:19 PM