Congress: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీరే.. అల్లు అర్జున్ మామకు స్వీట్ న్యూస్!
ABN, Publish Date - Mar 07 , 2024 | 11:42 PM
Telangana Parliament Elections 2024: తెలంగాణ కాంగ్రెస్ (Congress) అభ్యర్థులను హైకమాండ్ దాదాపు ఖరారు చేసింది. తొలి జాబితాలో మొత్తం 9 మంది అభ్యర్థులను ప్రకటించాలని అగ్రనేతలు భావించినప్పటికీ.. 7 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరింది. కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ అభ్యర్థులు ఫిక్స్ అయినట్లేనని తెలుస్తోంది...
తెలంగాణ కాంగ్రెస్ (Congress) అభ్యర్థులను హైకమాండ్ దాదాపు ఖరారు చేసింది. తొలి జాబితాలో మొత్తం 9 మంది అభ్యర్థులను ప్రకటించాలని అగ్రనేతలు భావించినప్పటికీ.. 7 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరింది. కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ అభ్యర్థులు ఫిక్స్ అయినట్లేనని తెలుస్తోంది. గురువారం రాత్రి సీఈసీలో తెలంగాణ పార్లమెంట్ అభ్యర్థులపై సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత జాబితాను ఫైనల్ చేయడం జరిగిందని సమాచారం. ఇవన్నీ అయ్యాక.. ఇక అగ్రనేతలు అధికారిక ప్రకటిసిస్తారన్న సమయంలో ఏఐసీసీ కార్యాలయం నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యాలయం నుంచి బయటికి వచ్చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే గురువారం అర్ధరాత్రి లోపే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
Big Breaking: ఎన్డీఏలోకి టీడీపీ.. బీజేపీకి ఇచ్చే సీట్లు ఇవే..!
Malla Reddy: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. కాంగ్రెస్‌లోకి మల్లారెడ్డి..!
ఇదిగో జాబితా..!
9 స్థానాలపై సీఈసీలో జరిగిన చర్చ జరగ్గా.. మొదటి జాబితాలో ఏడుగురు అభ్యర్థులను ప్రకటించడానికి అగ్రనేతలు సన్నాహాలు చేస్తున్నారు.
1. మహబూబ్‌నగర్ : వంశీ చంద్ రెడ్డి
2. సికింద్రాబాద్: బొంతురామ్మోహన్
3. పెద్దపల్లి : గడ్డం వంశీ
4. నల్గొండ : రఘువీర్ రెడ్డి (జానారెడ్డి కుమారుడు)
5. మహబూబాబాద్ : విజయాబాయి బానోతు/ బలరాం నాయక్
6. చేవెళ్ల : పట్నం సునీతా రెడ్డి
7. మల్కాజ్‌గిరి : కంచర్ల చంద్ర శేఖర్ రెడ్డి (హీరో అల్లు అర్జున్ మామ)
Kodali Nani: కొడాలి నాని సంచలన నిర్ణయం.. కంగుతిన్న వైసీపీ!
ఇటు షాక్.. అటు స్వీట్ న్యూస్!
కాగా టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇక్కడ్నుంచి పోటీచేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ.. అవన్నీ అడియాసలే అయ్యాయి. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మొదలు.. అధికారంలోకి వచ్చే వరకూ మీడియా ముందుకు వచ్చి బండ్ల ఏ రేంజ్‌లో మాట్లాడారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అంతేకాదు.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇక బండ్ల గణేష్ అస్సలు ఆగలేదు. ఏకంగా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలుకుని హరీష్ రావు, కేటీఆర్, మల్లారెడ్డి ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. దీంతో ఆయనకు టికెట్ పక్కా అయ్యింది కాబట్టే ఇలా రెచ్చిపోతారనే టాక్ కూడా వచ్చింది. సీన్ కట్ చేస్తే ఇటు బండ్లకు షాకిచ్చి.. అటు అల్లు అర్జున్ మామకు స్వీట్ న్యూస్ చెప్పిందట హైకమాండ్. అయితే.. బండ్లకు మరో కీలక హామీ ఇచ్చిన తర్వాతే అధిష్టానంఈ నిర్ణయం తీసుకుందని టాక్. మరోవైపు.. మైనంపల్లి హన్మంతరావు కూడా ఇక్కడ్నుంచి పోటీచేస్తారని ప్రచారం జరిగింది. అయితే.. ఆయన పోటీచేయడానికి సుముఖంగా లేకపోవడంతో కంచర్లకు ఛాన్స్ ఇచ్చిందనే టాక్ నడుస్తోంది.
తగ్గేదేలే..!
వయనాడ్ బరిలో మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉన్నట్లు తెలియవచ్చింది. అయితే విపక్ష కూటమి నుంచి సీపీఐ పోటీ చేస్తున్నప్పటికీ రాహుల్ మాత్రం వెనక్కి తగ్గట్లేదని సమాచారం. అయితే.. అమేథీలో పోటీపై మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నది. ఇదే విషయంపై మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రాహుల్ ఎక్కడ్నుంచి పోటీచేస్తారో మొదటి జాబితా ద్వారా తెలియజేస్తామన్నారు. మరో గంటలో అధికారికంగా తొలి జాబితా వచ్చే ఛాన్స్ ఉందన్నారు. ఇవాళ సమావేశంలో కొన్ని రాష్ట్రాల్లో పోటీచేసే అభ్యర్థులపై నిశితంగా చర్చించామని చెప్పారు.
BRS: కేసీఆర్‌పై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం.. ఏదో ఒకటి తేల్చాలని ఘాటు లేఖ!
Updated Date - Mar 07 , 2024 | 11:42 PM