ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MLC Kavitha: ఏ క్షణమైనా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..?

ABN, Publish Date - Mar 15 , 2024 | 05:04 PM

ED Raids On Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) ఏ క్షణమైనా అరెస్ట్ చేయడానికి ఈడీ, ఐడీ (ED, IT) రంగం సిద్ధం చేసిందా..? సుదీర్ఘ సోదాల తర్వాత కవితను అదుపులోనికి తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయా..? అంటే హైదరాబాద్‌లో ఆమె ఇంటి దగ్గర పరిస్థితులను బట్టి చూస్తే కచ్చితంగా ఇదే జరగొచ్చని తెలుస్తోంది..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) ఏ క్షణమైనా అరెస్ట్ చేయడానికి ఈడీ, ఐడీ (ED, IT) రంగం సిద్ధం చేసిందా..? సుదీర్ఘ సోదాల తర్వాత కవితను అదుపులోనికి తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయా..? అంటే హైదరాబాద్‌లో ఆమె ఇంటి దగ్గర పరిస్థితులను బట్టి చూస్తే కచ్చితంగా ఇదే జరగొచ్చని తెలుస్తోంది. ఎందుకంటే.. కవిత ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించడం.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తుండటం.. ఇప్పటికే కవిత, ఆమె సహాయకుల ఫోన్లను స్వాధీనం చేసుకోవడంతో ఇవాళ రాత్రిలోపు కీలక పరిణామమే చోటుచేసుకోవచ్చని తెలుస్తోంది. పైగా.. ఈడీ, ఐటీ అధికారులు జాయింట్ సోదాల్లో ఆధారాలన్నీ దొరికాయని తెలియవచ్చింది. ప్రస్తుతం కవిత స్టేట్మెంట్‌ను అధికారులు రికార్డ్ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ సోదాలు జరుగుతున్నాయి.

Big Breaking: ఎన్నికల ముందు ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఝలక్..



ఏం జరుగుతుందో..?

మరోవైపు.. కవిత భర్త దేవనపల్లి అనిల్‌కుమార్‌కు సంబంధించిన లావాదేవీలపైనా ఆరా తీస్తోంది ఈడీ. దీంతో బీఆర్ఎస్‌లో ఆందోళన మొదలైంది. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక బీఆర్ఎస్ అగ్రనేతలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఒకవేళ కవితను అరెస్ట్ చేయాల్సి వస్తే.. ఆమెతో పాటు అనిల్‌ను కూడా అదుపులోనికి తీసుకుని విచారించే అవకాశాలూ మెండుగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ కార్యకర్తలు, కవిత వీరాభిమానులు, అనుచరులు.. పలువురు నేతలు కవిత ఇంటికి చేరుకుంటున్నారు. అరెస్ట్ చేస్తారన్న వార్తలతో ఆందోళన చెందుతున్నారు. కవితకు సంబంధించిన రెండు ఫోన్లు, భర్త ఫోన్లు.. సహాయకుల ఫోన్లను ఇలా మొత్తం 16 ఫోన్లను స్వాధీనం చేసుకోవడంతో ఏదో జరుగుతోందనే అనుమానం అభిమానుల్లో మరింత ఎక్కువవుతోంది.

అరెస్టా.. రిలీఫా..?

ఈ సోదాలకు సంబంధించి ఇంతవరకూ ఈడీ, ఐటీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. అయితే.. ఇవాళ, రేపు కూడా సోదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం అందుతోంది. అయితే తనపై చర్యలు తీసుకోకుండా ఆపాలన్న కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంతవరకూ ఎలాంటి అరెస్టులు ఉండవనే ప్రచారం కూడా గట్టిగానే జరుగుతోంది. సుప్రీం తీర్పు కచ్చితంగా కవితకు అనుకూలంగా వస్తుందని ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని కొందరు ఆమె వీరాభిమానులు, అనుచరులు చెబుతున్న మాట. ఫైనల్‌గా కవితను అరెస్ట్ చేస్తారా..? లేకుంటే సోదాలతోనే సరిపెడతారా..? అనేది తెలియాల్సి ఉంది. అయితే కవిత పిటిషన్‌ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా.. ఇలా సోదాలు చేయడమేంటి..?.. విచారణను ఈడీ పట్టించుకోదా..? అని కవిత లాయర్ సోమా భరత్ అని మండిపడుతున్నారు. తీర్పు వచ్చేదాకా ఎలాంటి చర్యలు తీసుకోమని ఈడీ చెప్పిన విషయాన్ని మరోసారి ఆయన గుర్తు చేశారు. కవితను అరెస్ట్ చేసే అవకాశం మాత్రం లేనేలేదని భరత్ మీడియాకు వెల్లడించారు.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 15 , 2024 | 05:06 PM

Advertising
Advertising