ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: రాఖీ పండుగ.. వైఎస్ షర్మిల గురించి అమర్నాథ్ ఇలా మాట్లాడారేంటి..?

ABN, Publish Date - Aug 19 , 2024 | 08:58 PM

వైఎస్ ఫ్యామిలీలో విబేధాలతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైఎస్ షర్మిలా రెడ్డి అస్సలు మాట్లాడుకోవడం లేదు. ఇద్దరూ ఉప్పు-నిప్పులానే ఉన్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటున్న ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరింత చిచ్చు రాజేశారు. దీంతో అటు షర్మిల అభిమానులు.. ఇటు జగన్ వీరాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి..

రక్షా బంధన్.. సోదరీ, సోదరుల మధ్య అంతులేని ప్రేమను సూచించే వేడుక. ఈ పండుగ వచ్చిందంటే చాలు.. అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ఎంతో సంతోషంగా ఉంటారు. దేశ వ్యాప్తంగా.. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ఘనంగా ఈ వేడుకను జరుపుకుంటున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. వైఎస్ ఫ్యామిలీలో విబేధాలతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) .. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila Reddy) అస్సలు మాట్లాడుకోవడం లేదు. ఇద్దరూ ఉప్పు-నిప్పులానే ఉన్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటున్న ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) మరింత చిచ్చు రాజేశారు. దీంతో అటు షర్మిల అభిమానులు.. ఇటు జగన్ వీరాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.


ఏం జరిగింది..?

అనకాపల్లి జిల్లా అనాథ ఆశ్రమంలో జరిగిన ఘటనపై మీడియా మీట్ నిర్వహించిన మాజీ మంత్రి.. ఆ విషయాలన్నీ మాట్లాడి సైలెంట్ అయ్యుంటే సరిపోయేదేమో..! అనవసరంగా రాఖీ పండుగ గురించి, వైఎస్ షర్మిల గురించి మాట్లాడి ఇరుక్కుపోయారు. షర్మిలపై గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాఖీ కట్టడానికి చెల్లి.. అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి. జగన్ అన్నయ్య కావాలనుకుంటే షర్మిల వస్తారు. నాకు తెలిసి అయితే అన్నయ్య దగ్గరికి చెల్లి వెళ్ళాలి.. రావాలనే నేను కూడా కోరుకుంటున్నాను. మరి ఏ అన్నయ్య దగ్గరికి వెళ్లి షర్మిల రాఖీ కడుతుందో చూడాలి’ అని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. సింపుల్‌గా అన్నయ్య కావాలంటే చెల్లి వస్తుందనే ఒక్క మాటతో వదిలేసి ఉంటే సరిపోయేది కానీ.. ఏ అన్నయ్య దగ్గరికి వెళ్తుందో చూడాలి అనే మాట అనడంతో వైసీపీ వీరాభిమానులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. అసలు ఎవరు సామీ.. ఈ టాపిక్ తీసుకురమ్మన్నారు..? రాఖీ కడతారా లేదా అన్నది ఆమె ఇష్టం.. వస్తే స్వాగతిస్తారా లేదా అన్నది ఆయనిష్టం..? మధ్యలో మీకెందుకు బాధ, మీకొచ్చిన బాధేంటి..? అని అటు కాంగ్రెస్, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు తిట్టిపోస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇదొక బర్నింగ్ టాపిక్‌గా మారింది. రేపొద్దున్న మీడియా ముందుకు వచ్చినప్పుడు షర్మిల ఈ ప్రస్తావన తీసుకురాకుండా ఉండరేమో. గట్టిగానే ఇచ్చిపడేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు!


అన్నకు తప్ప అందరికీ..!

ఇదిలా ఉంటే.. రాఖీ పండుగ నాడు షర్మిల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే తోడబుట్టిన అన్న జగన్‌ను మరిచిపోయిన షర్మిల ఇలా మాట్లాడుతున్నారేంటి..? అనే విమర్శలూ వస్తున్నాయి. రాఖీ పండుగను పురస్కరించుకుని సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.నా జీవితంలో, రాజకీయ ప్రస్థానంలో అడుగడుగునా అండగా ఉంటూ రక్త సంబంధం లేకపోయినా.. వైఎస్సార్ అనే బంధంతో నాకు తోబుట్టువుల్లాగా నిలబడి, అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. రక్షణగా నిలబడ్డ ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు అని తెలిపారు షర్మిల. వెలకట్టలేని బంధాలను, వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రక్షాబంధనం.. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని నా ప్రార్ధనఅంటూ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. చూశారుగా.. ఎక్కడా సొంత అన్న ప్రస్తావన లేకపోవడంతో వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.


జగన్ ఇలా..!

ఆంధ్రప్రదేశ్‌లోని అక్క చెల్లెమ్మలందరికీ వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మీరు మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రయాణంలో ఎల్లప్పుడూ మీకు నేను తోడుగా ఉంటాను. కుటుంబాలకు మంచి భవిష్యత్తును అందించడంలో అక్కచెల్లెమ్మల పాత్ర కీలకమని నేను బలంగా నమ్ముతానుఅని ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాసుకొచ్చారు. మాజీ సీఎం కూడా ఎక్కడా వైఎస్ షర్మిల పేరు ప్రస్తావించలేదు. అటు చెల్లి.. ఇటు అన్న జగన్ ఎవరూ ఒకరిపేర్లు ఒకరి నోట రాలేదు. అయినా ఈ ఇద్దరూ ఎప్పుడు ఒకటవుతారో.. అసలు అది జరిగే పనేనా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

Updated Date - Aug 19 , 2024 | 09:05 PM

Advertising
Advertising
<