ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: చంద్రబాబు నుంచి బండారుకు పిలుపు.. వైసీపీ బంపరాఫర్లు!

ABN, Publish Date - Mar 30 , 2024 | 02:52 PM

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఓ వైపు టికెట్లు రాక మరొక పార్టీలో చేరిపోవడానికి కీలక నేతలు రంగం సిద్ధం చేసుకుంటూ ఉంటే.. మరోవైపు అసంతృప్తులను బుజ్జగించడానికి ఆయా పార్టీల అగ్రనేతలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా.. టీడీపీ విషయానికొస్తే..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఓ వైపు టికెట్లు రాక మరొక పార్టీలో చేరిపోవడానికి కీలక నేతలు రంగం సిద్ధం చేసుకుంటూ ఉంటే.. మరోవైపు అసంతృప్తులను బుజ్జగించడానికి ఆయా పార్టీల అగ్రనేతలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా.. టీడీపీ విషయానికొస్తే ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru Satyanarayana Murthy) తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో సైకిల్ దిగేసి ఫ్యాన్ పార్టీ చెంతకు చేరిపోతారని కూడా టాక్ నడిచింది. సీన్ కట్ చేస్తే.. ఇవాళ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నుంచి పిలుపొచ్చింది. అమరావతి వచ్చి తనను కలవాలని బండారుకు బాబు కబురు పంపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీనియర్ నేత.. ఒకట్రెండు రోజుల్లో చంద్రబాబును కలవడానికి సిద్ధమైనట్లుగా తెలియవచ్చింది.

కాంగ్రెస్‌లోకి నందమూరి సుహాసిని.. కీలక పదవి!


ఎందుకీ అసంతృప్తి..!

ఉమ్మడి విశాఖపట్నంలో కీలక నియోజకవర్గమైన పెందుర్తి ఎమ్మెల్యే సీటు ఆశించి సత్యనారాయణ భంగపడ్డారు. కూటమిలో భాగంగా.. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించడం జరిగింది. దీంతో మరోస్థానం నుంచి బండారును పోటీ చేయించాలని టీడీపీ భావించినప్పటికీ కుదరలేదు. దీంతో అసంతృప్తికి లోనైన ఆయన.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాదు.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత ఇస్తామని కూడా చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఆయన మాత్రం అసంతృప్తితోనే ఉండిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో కాసింత కూల్ అయ్యారని తెలుస్తోంది. అయితే చంద్రబాబుతో భేటీలో ఏం జరుగుతుందా..? అని పెందుర్తి టీడీపీ శ్రేణుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

టీడీపీలోనే ఉంటా..!

మరోవైపు.. ఇవాళ నాలుగు మండలాల కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, శ్రేయోభిలాషులతో పరవాడలో బండారు సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని అందరూ భావించారు. అభిమానుల సమక్షంలో తనకు సీటు రాలేదని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా.. తనకు వైసీపీ నుంచి వచ్చిన ఆఫర్లను తిరస్కరించిన విషయం కూడా ప్రస్తావించారు. ఫైనల్‌గా టీడీపీలోనే ఉండాలని బండారు నిశ్చయించుకున్నారు.నాకు ఏ రోజూ పదవులు ఇవ్వలేదని పార్టీని నేను అడగలేదు.. పార్టీకి ఎపుడు విధేయుడిగా మాత్రమే ఉన్నాను.. అంతే తప్ప పార్టీకి ఎన్నడూ దోహ్రం చేయలేదు. నా కట్టే కాలేంతవరకు పసుపు జెండా మోస్తూనే ఉంటానని.. నా ఛాతి మీద పసుపు జెండా వేసి కాల్చాలిఅని అభిమానులు, నేతలతో సత్యనారాయణ చెప్పారు.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 30 , 2024 | 02:52 PM

Advertising
Advertising