ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Politics: తెలంగాణ అసెంబ్లీలో తొడగొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఆ తర్వాత సీన్ ఇదీ..!

ABN, Publish Date - Jul 27 , 2024 | 04:57 PM

అవును.. మీరు వింటున్నది నిజమే..! ఇలాంటివి మామూలుగా సినిమాల్లో లేకుంటే సీరియల్స్‌లో చూస్తుంటాం..! ప్రజాప్రతినిధులు అది కూడా అసెంబ్లీ వేదికగా అంటే ఎవరూ నమ్మరు.. నమ్మలేరు అంతే..! కానీ మీరు వింటున్నది మాత్రం అక్షర సత్యమే..! ఈ ‘తొడగొట్టుడు’ సీన్ తెలంగాణ అసెంబ్లీ వేదికగా జరిగింది. అది కూడా...

అవును.. మీరు వింటున్నది నిజమే..! ఇలాంటివి మామూలుగా సినిమాల్లో లేదా సీరియల్స్‌లో చూస్తుంటాం..! ప్రజాప్రతినిధులు అది కూడా అసెంబ్లీ వేదికగా అంటే ఎవరూ నమ్మరు.. నమ్మలేరు అంతే..! కానీ మీరు వింటున్నది మాత్రం అక్షర సత్యమే..! ఈ ‘తొడగొట్టుడు’ సీన్ తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly Sessions)వేదికగా జరిగింది. అది కూడా చాలెంజ్ చేసి మరీ తొడగొట్టారు అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే.! ఈ ఘటనతో అసెంబ్లీ అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.. అసలేం జరుగుతోంది..? ఎందుకింత రచ్చ..? ఎమ్మెల్యే ఎందుకు ఇంత సడన్‌గా ఊగిపోయి మరీ తొడగొడుతున్నారు..? అంటూ సభ్యులంతా ఆయన వైపే చూడసాగారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..? ఎందుకిలా చేయాల్సి వచ్చింది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


అసలేం జరిగింది..?

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పట్నుంచీ.. ‘ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు.. ఏ క్షణమైనా పడిపోతుంది..’ అంటూ అటు బీజేపీ.. ఇటు బీఆర్ఎస్ నేతల నుంచి పెద్ద ఎత్తున చాలెంజ్‌లు వస్తూనే ఉన్నాయి. ఆఖరికి అసెంబ్లీ సమావేశాలకు ముందు కూడా ఇవే మాటలు వచ్చాయ్. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. అరే.. బై ప్రతిసారి ఈ పడగొడతాం.. పడగొట్టుడు ఏంది అంటూ అసెంబ్లీలోనే ఆగ్రహంతో ఊగిపోయారు. ‘ఎవరైనా సరే ప్రభుత్వాన్ని పడగొడతాం అంటే ఊరుకొనేది ప్రసక్తేలేదు. ప్రభుత్వానికి సహకారం ఇవ్వండి అంతే తప్ప.. ఊరికే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతాం.. పడ గొడతాం అంటే మేము తొడగొడతాం’ అని రామ్మోహన్ రెడ్డి గట్టిగానే మాట్లాడేశారు. మాటలే కాదు చేతల్లోనే తొడగొట్టి మరీ చూపించారు పరిగి ఎమ్మెల్యే.


అటు ప్రశంసలు.. ఇటు విమర్శలు!

ఎమ్మెల్యే తొడగొట్టుడుతో ఒక్కసారిగా అసెంబ్లీ మొత్తం సైలెంట్ అయిపోయింది. రెండు నిమిషాల తర్వాత తేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బల్లలు చరిచారు. అయితే ఇలా చేయడం అనేది ప్రతిపక్షాలకు ఒక మేసేజ్.. రెండోసారి ఇలా అనకుండా ఉండటానికే అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే.. ప్రజా సమస్యలపై గళం వినిపించి పరిష్కరించాల్సిన అసెంబ్లీలో తొడగొట్టడమేంటి..? అని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయినా పరిగి ఎమ్మెల్యేకు వివాదాలు కొత్తేమీ కాదని.. పరిపాటిగా వస్తున్నాయని విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇదే అసెంబ్లీలోనే చేవెళ్ల చెల్లమ్మ సబితా ఇంద్రారెడ్డిపైనా రామ్మోహన్ రెడ్డి జోక్స్ వేయడంతో అసెంబ్లీ మొత్తం నవ్వుకున్నా.. బయట మాత్రం విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. కొన్నేళ్ల కిందట ప్రభుత్వ ఉద్యోగిపై బూతుపురాణంతో పెద్ద ఎమ్మెల్యే వ్యవహారం హాట్ టాపిక్కే అయ్యింది. ఇప్పటి వరకూ.. ఈ మొత్తం వ్యవహారంపై బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు కానీ.. స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.

Updated Date - Jul 27 , 2024 | 06:30 PM

Advertising
Advertising
<