ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election Results: ఏపీలో ఏం నడుస్తోంది.. వైసీపీపై ఒక్కటే ట్రోలింగ్.. ఇదిగానీ చూశారో..!!

ABN, Publish Date - Jun 04 , 2024 | 04:16 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎంతలా అంటే ఫ్యాన్ సునామీనే.. వైనాట్ 175 దగ్గర్నుంచి ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్న పరిస్థితి. కేవలం సింగిల్ డిజిట్‌లోనే అభ్యర్థులు గెలుస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకూ పట్టుమని పది మంది కూడా గెలవని దుస్థితి వైసీపీకి రావడం గమనార్హం...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Election Results) కనివినీ ఎరుగని రీతిలో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎంతలా అంటే ఫ్యాన్ సునామీనే.. వైనాట్ 175 దగ్గర్నుంచి ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్న పరిస్థితి. కేవలం సింగిల్ డిజిట్‌లోనే అభ్యర్థులు గెలుస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకూ పట్టుమని పది మంది కూడా గెలవని దుస్థితి వైసీపీకి రావడం గమనార్హం. ఆఖరికి వైఎస్ జగన్ రెడ్డి కంచుకోటగా ఉన్న వైఎస్సార్ కడప జిల్లాలో కూడా కూటమి దెబ్బకు వైసీపీ విలవిలలాడుతన్న పరిస్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే అసలు ఎక్కడ తేడా కొట్టింది..? ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయిందో కూడా ఊహించుకోలేని.. మాట్లాడుకోలేని పరిస్థితిలో వైసీపీ ఉంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే సోషల్ మీడియా వేదికగా ఏపీలో ఏం నడుస్తోంది..? వైసీపీని జనాలు ఏ జిల్లాలో ఎలా ఓడించారు..? ఏయే జిల్లాల ప్రజల మనోగతం ఏమిటి..? అని ఒక మెసేజ్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్కేయండి..!


ఇదే నడుస్తోంది..?

  1. చితకొట్టిన శ్రీకాకుళం

  2. విరగొట్టిన విజయనగరం

  3. విసిరేసిన విశాఖపట్నం

  4. తరిమేసిన తూర్పు గోదావరి

  5. పాతరేసిన పశ్చిమ గోదావరి

  6. కుప్ప కూల్చేసిన కృష్ణ

  7. కారం కొట్టిన గుంటూరు

  8. ఓడ గొట్టిన ఒంగోలు

  9. నేల కూల్చిన నెల్లూరు

  10. చీ.. ఛీ కొట్టిన చిత్తూరు

  11. కాల్చేసిన కడప

  12. ఖతం చేసిన కర్నూలు

  13. అంతం చేసిన అనంతపురం!

మొత్తంగా ఇదండీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల యొక్క అభిప్రాయం.. అంటూ సోషల్ మీడియాలో ఈ మెసేజ్ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. ఇన్నిరోజులు తెగ హడావుడి చేసి.. సోషల్ మీడియా మాదే అన్నట్లుగా రచ్చ రచ్చచేసిన వైసీపీ ఈ ట్రోలింగ్‌ను ఎదుర్కోలేక, విలవిల్లాడుతుండటం గమనార్హం. చూశారుగా.. ఎగిరెగిరి పడితే ఎలా ఉంటుంది..? అనేది.. ఇక పూర్తి ఫలితాలు వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో..!



ఇవి కూడా చదవండి


అంతా దేవుడి స్క్రిప్ట్.. అవును అక్షరాలా నిజమే జగన్!


వైఎస్ జగన్ చెప్పినట్లే.. దేశం మొత్తం ఏపీ వైపు చూసిందిగా!


Updated Date - Jun 04 , 2024 | 04:16 PM

Advertising
Advertising