ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP First List: ఏపీ నుంచి ఒక్క ఎంపీ అభ్యర్థినీ ప్రకటించని బీజేపీ.. ఎందుకో..!?

ABN, Publish Date - Mar 02 , 2024 | 08:31 PM

BJP First MP Candidates List: హ్యాట్రిక్ కొట్టాల్సిందేనని.. బీజేపీ (BJP) పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. కాంగ్రెస్ తమతో కలిసొచ్చే పార్టీలను కలుపుకోని పోయే పనిలో ఉంటే.. బీజేపీ మాత్రం అందరి కంటే ముందుగానే కూటమి ఏర్పాటు చేసేయడం.. అభ్యర్థులను కూడా ప్రకటించేసే పనిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మోదీ మూడోసారి ప్రధాని కావాల్సిందేనని బీజేపీ పెద్దలు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. చిన్నపాటి అవకాశం వచ్చినా సరే.. సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు..

హ్యాట్రిక్ కొట్టాల్సిందేనని.. బీజేపీ (BJP) పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. కాంగ్రెస్ తమతో కలిసొచ్చే పార్టీలను కలుపుకోని పోయే పనిలో ఉంటే.. బీజేపీ మాత్రం అందరి కంటే ముందుగానే కూటమి ఏర్పాటు చేసేయడం.. అభ్యర్థులను కూడా ప్రకటించేసే పనిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మోదీ మూడోసారి ప్రధాని కావాల్సిందేనని బీజేపీ పెద్దలు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. చిన్నపాటి అవకాశం వచ్చినా సరే.. సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకమునుపే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు సంబంధించిన 195 మందితో తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో 28 మంది మహిళలు.. 47 మంది యువత, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్థానాలను కేటాయించడం జరిగింది. అంతేకాకుండా.. తొలి జాబితాలో 57 మంది ఓబీసీలు.. 34 మంది మంత్రులు కూడా ఉన్నారు. తెలంగాణ నుంచి 9 సీట్లకు అభ్యర్థుల ప్రకటించడం జరిగింది. ఇక బెంగాల్‌ నుంచి 20, మధ్యప్రదేశ్‌ 24, గుజరాత్‌ 15, రాజస్థాన్‌ 15, కేరళ 12 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.


అంతా ఓకే కానీ..?

195 మందితో తొలి జాబితాలో 16 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్లు ప్రకటించిన బీజేపీ.. ఏపీ నుంచి మాత్రం ఒక్కరంటే ఒక్కరినీ ప్రకటించలేదు. దీంతో ఆశావహులు కంగుతిన్నారు. ఇదేంటి.. ఇలా జరిగింది..? ఒక్క అభ్యర్థి పేరు లేకపోవడమేంటి..? అని ఆందోళన చెందుతున్న పరిస్థితి. అభ్యర్థుల ప్రకటిస్తున్న సమయంలో పోటీచేయాలని భావిస్తున్న కమలనాథులు టీవీలకు అతుక్కుపోయారు. సీన్ కట్ చేస్తే.. ఒక్క పేరూ రాకపోవడం గమనార్హం. అయితే.. టీడీపీ-జనసేనతో బీజేపీ కూడా పొత్తుకు సిద్ధమైంది కూడా. ప్రస్తుతం పొత్తు చర్చలు కొనసాగుతుండటంతో బీజేపీ పెద్దలు ఏపీ జోలికెళ్లలేదు. పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయాలను అధిష్టానం సేకరిస్తున్నది. పొత్తులపై క్లారిటీ వచ్చాకే ఏపీ అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది.


లెక్క తేలినట్లే..?

ఏపీలో ఒంటరిగా పోటీ చేయాలా..? లేకుంటే టీడీపీ-జనసేన కూటమితో పొత్తులతోనే ముందుకు వెళ్లాలా..? అనే దానిపై శనివారం నాడు కీలక సమావేశమే జరిగింది. పొత్తులో వెళ్తేనే బాగుంటుందని కొందరు.. ఒంటరిగానే పోటీచేస్తే మంచిదని ఇంకొందరు నేతలు.. కేంద్రం నుంచి వచ్చిన పెద్దలకు నిశితంగా వివరించారట. దీంతో ఇంకా కసరత్తు పూర్తి కాలేదు. ఇందుకోసమే ఏపీ బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అటు పార్లమెంట్.. ఇటు అసెంబ్లీలో ఏపీ నుంచి నేతలు తప్పకుండా అడుగుపెట్టాల్సిందేనని హైకమాండ్ గట్టిగానే వ్యూహ రచన చేస్తోంది. బోణీ కొట్టాలన్నదే ప్రస్తుతం ఏపీ కమలనాథుల టార్గెట్. హిందూపురం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, విశాఖపట్నం నుంచి జీవీఎల్ నర్సింహారావు, పురంధేశ్వరి పోటాపోటీగా ఉన్నారు. ఇంకా.. మాధవ్, కిరణ్ కుమార్ రెడ్డి.. సత్యకుమార్‌తో పలువురు ముఖ్యనేతలు అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఇలా దాదాపు 25 లోక్‌సభ స్థానాలకు ముఖ్యనేతలే సీట్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే పొత్తులో వెళ్తే ఎవరి సీటు దక్కుతుంది..? పొత్తులో లేకుండా ఒంటిరిపోరు చేస్తే హైకమాండ్ ఆశీస్సులు ఎవరికి ఉంటాయో తెలియాలంటే ఒకట్రెండు రోజులు వేచి చూడక తప్పదు మరి.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 02 , 2024 | 08:35 PM

Advertising
Advertising