YS Jagan: జగన్.. ఇంగ్లీష్ రాదా.. ఏంటి..? ఎక్కడ చూసినా ఇదే చర్చ!
ABN, First Publish Date - 2024-02-09T22:57:14+05:30
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇంగ్లీష్ రాదా..? ఎందుకు కనీసం నోరు మెదపలేదు..? జాతీయ మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే కనీసం స్పందించలేదేం..? ఇంతకీ ఇంగ్లీష్ వచ్చా.. రాదా..? ఇప్పుడిదే అటు సోషల్ మీడియాలో.. ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో జరుగుతున్న పెద్ద చర్చ. అసలేం జరిగిందో తెలిస్తే నవ్వుకుంటారేమో. ఇక ఆలస్యమెందుకు రండి మీ కళ్లతో చూసి.. చెవులారా విని తరించండి..!
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇంగ్లీష్ రాదా..? ఎందుకు కనీసం నోరు మెదపలేదు..? జాతీయ మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే కనీసం స్పందించలేదేం..? ఇంతకీ ఇంగ్లీష్ వచ్చా.. రాదా..? ఇప్పుడిదే అటు సోషల్ మీడియాలో.. ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో జరుగుతున్న పెద్ద చర్చ. అసలేం జరిగిందో తెలిస్తే నవ్వుకుంటారేమో. ఇక ఆలస్యమెందుకు రండి మీ కళ్లతో చూసి.. చెవులారా విని తరించండి..!
అసలేం జరిగింది..?
భారతమ్మ బంగారు ముద్దు బిడ్డ.. రాజనీతిజ్ఞుడు, బహూ బాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిన మహానేత.. రూపాయి విలువ పడిపోకుండా కాపాడిన మేధావి. తెలుగు బిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ పాములపర్తి వెంకట నరసింహా రావును (పీవీ నరసింహా రావు) మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఇది నిజంగా తెలుగోడు గర్వించదగిన విషయం. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీల వరకూ స్పందించి.. పీవీ సేవలను కొనియాడుతున్నారు. ఈ అవార్డు ప్రకటన సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి మాత్రం కనీసం స్పందించలేదు. ఏదో ఒక్క మాట అయినా మాట్లాడుతారని ఆశించినప్పటికీ.. అబ్బే అదేం పట్టదు అన్నట్లుగా సీఎం వ్యవహరించారు. జాతీయ మీడియా ‘పీవీకి భారతరత్న’పై మాట్లాడాలని పదే పదే ప్రశ్నించినప్పటికీ స్పందన రాకపోవడం గమనార్హం. చివరాకరికి ఈ విషయంపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తారని నమస్కరిస్తూ మీడియా నుంచి తప్పించుకున్నారు జగన్.
కామెంట్స్.. కౌంటర్లు!
చూశారుగా.. భారత రాజకీయాల్లో శిఖర సమానులు, తెలుగు వ్యక్తికి అత్యున్నత పురస్కారం వస్తే జగన్ నోట ఒక్క మాట రాలేదంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడిదే సోషల్ మీడియాలో పెద్ద చర్చ.. రచ్చ జరుగుతోంది. సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఏదో ఒకటి.. ఒక్క మాట అయినా మాట్లాడి ఉండొచ్చు కదా.. జగన్ ఎందుకిలా చేశారంటూ నిట్టూరుస్తున్నారు. అయితే.. నెట్టింట్లో చిత్ర విచిత్రమైన ప్రశ్నలు సంధిస్తున్నారు జగన్ వ్యతిరేకులు. ఇంతకీ జాతీయ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు అర్థం కాలేదా..? లేకుంటే సీఎంకు ఇంగ్లీష్ రాదా..? పదే పదే అడిగినా పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేంటి..? అని జగన్‌ను తిట్టిపోస్తున్నారు. ఇంకొందరైతే జగన్.. ఇంగ్లీష్ రాదా ఏంటి..? అని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. సీఎంను అడిగితే.. ఎంపీ స్పందిస్తారని ఆయనే చెప్పడమేంటి.. ఇది నిజంగా సిగ్గో.. సిగ్గు అంటూ నెటిజన్లు కామెంట్స్, ట్రోలింగ్స్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి
Updated Date - 2024-02-09T23:09:03+05:30 IST