మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: కేంద్ర కేబినెట్‌లోకి టీడీపీ.. చంద్రబాబు ఏయే శాఖలు అడగొచ్చు..!?

ABN, Publish Date - Jun 05 , 2024 | 10:40 PM

16 ఎంపీ సీట్లు ఉన్న టీడీపీకి కేంద్ర కేబినెట్‌లోకి చోటు ఉంటుందా.. లేదా..? ఉంటే ఎవరెవర్ని మంత్రి పదవులు వరించొచ్చు..? అనేదానిపై ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఒక్కటే చర్చ జరుగుతోంది..

Chandrababu: కేంద్ర కేబినెట్‌లోకి టీడీపీ.. చంద్రబాబు ఏయే శాఖలు అడగొచ్చు..!?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election Results) ఘన విజయం సాధించిన కూటమికి త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను..’ (Chandrababu) అంటూ జూన్-12న టీడీపీ అధినేత ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. ఇక జనసేన (Janasena) నుంచి నలుగురు, బీజేపీ నుంచి ఇద్దర్ని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇంతవరకూ అంతా ఓకే కానీ.. 16 ఎంపీ సీట్లు ఉన్న టీడీపీకి కేంద్ర కేబినెట్‌లోకి చోటు ఉంటుందా.. లేదా..? ఉంటే ఎవరెవర్ని మంత్రి పదవులు వరించొచ్చు..? సీనియర్లకు ప్రాధాన్యత ఉంటుందా లేకుంటే యువ ఎంపీలకు ఉంటుందా..? కేబినెట్‌లో ఏయే శాఖలు తీసుకోవచ్చు..? సహాయక శాఖలకే పరిమితం కావొచ్చా..? అనేదానిపై ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఒక్కటే చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇద్దరూ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో మంత్రి పదవులు, శాఖల గురించి తెలుసుకోవడానికి తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

నాడు నో అపాయిట్మెంట్.. నేడు మోదీ పక్కనే చంద్రబాబు!


Chandrababu-And-Modi.jpg

ఏమేం తీసుకోవచ్చు..?

టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తక్కువలో తక్కువ నాలుగు నుంచి ఐదు శాఖలు, లోక్‌సభ స్పీకర్ పదవిని కోరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో.. ఆర్థికశాఖ, ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, వ్యవసాయ శాఖ ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. దీన్ని బట్టి చూస్తే దాదాపు కీలక శాఖలన్నీ టీడీపీ చేతిలోకి వచ్చేస్తాయ్. ఈ శాఖలనే రేపో మాపో.. ఎన్డీఏ పెద్దలు, మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ, అమిత్ షాలతో చర్చించే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇవి ఒప్పుకోని పరిస్థితుల్లో ఇతర ఏ శాఖలు అడగొచ్చు అనే దానిపై పవన్, చంద్రబాబు ఓ క్లారిటీతో ఉన్నట్లుగా తెలియవచ్చింది. ప్రత్యేక హోదా మాత్రం పక్కాగా ఇవ్వాల్సిందేనని గట్టిగా పట్టుబట్టే ఛాన్స్ ఉందట. ఇవన్నీ ఒక ఎత్తయితే ఎవరెవర్ని కేంద్ర కేబినెట్‌లోకి పంపించాలనే దానిపై నిశితంగా చర్చ జరిగిందని.. ఇందులో ఇద్దరు యంగ్ ఎంపీలు, మరో ముగ్గురు సీనియర్లను సెలక్ట్ చేశారని గుసగుసలు నడుస్తున్నాయి.


జాతీయ మీడియా ప్రకారం..!

కేంద్ర కేబినెట్‌లోకి టీడీపీ అనేదానిపై ప్రాంతీయ మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. చంద్రబాబు మనసులో ఏముంది..? ఏయే శాఖలు అడిగే అవకాశం ఉంది..? అని పెద్ద ఎత్తునే కథనాలు వస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు కీలకం కాబట్టి 05 నుంచి 06 శాఖలు డిమాండ్ చేసే అవకాశముందని ఇండియా టుడేలో సంచలన కథనమే వచ్చింది. ఈ కథనం ప్రకారం ఆర్థిక శాఖ, విద్య- వైద్య శాఖ, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, హౌసింగ్ అండ్ అర్భన్ అఫైర్స్, జల్‌శక్తి, ఐటీ అండ్ కమ్యూనికేషన్స్, రోడ్డు రవాణా శాఖతో పాటు లోక్‌సభ స్పీకర్ పదవి కూడా అడిగే ఛాన్స్ ఉందని జాతీయ మీడియా చెబుతోంది. మరి ఇందులో ఎన్ని శాఖలు దక్కుతాయి..? అనేదానిపై క్లారిటీ రావాలంటే ఒకట్రెండు రోజులు ఆగాల్సిందేనేమో..!!

ఇలాంటి మరెన్నో పొలిటికల్ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 05 , 2024 | 10:53 PM

Advertising
Advertising