ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Jagan: వైఎస్ జగన్ బిజిబిజీ.. చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురుచూపులు!

ABN, Publish Date - Aug 12 , 2024 | 07:34 PM

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బిజిబిజీగా గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో క్రికెట్ టీమ్‌కే పరిమితమైన వైసీపీ (YSR Congress).. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి సత్తా ఏంటో చూపించాలని విశ్వప్రయత్నాలే చేస్తోంది హైకమాండ్. అయితే.. నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా బలమున్న..

అమరావతి: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బిజిబిజీగా గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో క్రికెట్ టీమ్‌కే పరిమితమైన వైసీపీ (YSR Congress).. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి సత్తా ఏంటో చూపించాలని విశ్వప్రయత్నాలే చేస్తోంది హైకమాండ్. అయితే.. నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా బలమున్న సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన వైఎస్ జగన్.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులతో బిజిబిజీగా గడుపుతున్నారు. అయితే వైజాగ్ వెళ్లి ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలను చక్కదిద్దాలని ఉత్తరాంధ్ర ఇంచార్జీ, వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డిని పంపగా.. ఆయన అక్కడేం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదని క్యాడర్ తల పట్టుకుంటోందట. నామినేషన్ కార్యక్రమానికి రాకపోవడం.. విశాఖలో ఉన్నప్పటికీ ఆయన ఎందుకు రాలేదు..? కలెక్టర్ కార్యాలయం గేటు దాకా వచ్చి సడన్‌గా మాయం కావడమేంటి..? ఏం జరుగుతోందనే విషయం హైకమాండ్‌ ఆరా తీసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.


నో అపాయిట్మెంట్స్!

ఎమ్మెల్సీ ఎన్నికలో గెలవడమే టార్గెట్‌గా పెట్టుకున్న వైఎస్ జగన్.. ఈ మేరకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి చక్రం తిప్పబోతున్నారట. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పార్టీ ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించిన అధినేత.. మంగళవారం, బుధవారం కూడా బిజిబిజీగా గడపనున్నారు. ఎన్నిక దగ్గరపడుతుండటంతో మిగిలిన నియోజకవర్గాల నేతలతో మాజీ సీఎం సమావేశం కాబోతున్నారు. దీంతో ఇతర జిల్లాలకు చెందిన నేతలను జగన్ కలిసేందుకు అవకాశం లేదని.. అపాయింట్మెంట్‌లు ప్రస్తుతానికి లేవని వైసీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఇప్పటికే 5 నియోజకవర్గాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో సమావేశమైన వైఎస్‌ జగన్.. మిగిలిన నియోజకవర్గాల నాయకులతో మంగళవారం, బుధవారం భేటీ కాబోతున్నారు. మరోవైపు.. క్యాంప్‌ రాజకీయాలు వైసీపీ గట్టిగానే చేస్తోంది.

బొత్స నామినేషన్‌కు వైవీ డుమ్మా.. ఏదో తేడా కొడుతోందే..!?



క్లారిటీ వచ్చేదెప్పుడో..!

బొత్సను అభ్యర్థిగా ప్రకటించడం.. నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయినప్పటికీ.. ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో ఇప్పటికీ కూటమి నేతలు నిర్ణయం తీసుకోలేదు. అభ్యర్థి ఎంపికపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం నాడు నామినేషన్‌కు ఆఖరి రోజు. దీంతో సోమవారం రాత్రికల్లా అభ్యర్థి విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం మెండుగానే కనిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఓ బడా బిజినెస్‌మెన్‌ను బరిలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తిని దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి జిల్లాలో టీడీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు.. కనీసం ఎంపీ టికెట్ అయినా దక్కుతుందని భావించినప్పటికీ అదీ జరగలేదు. దీంతో దిలీప్‌ను ఎమ్మెల్సీ బరిలోకి దింపాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) నిర్ణయించినట్లుగా సమాచారం. టీడీపీ అధినేత తీసుకునే నిర్ణయం కోసం కూటమి నేతలు ఎదురుచూపుల్లో ఉన్నారు. అభ్యర్థిని ప్రకటించడం ఆలస్యం కావొచ్చేమో కానీ.. ఈసారి దెబ్బకొడితే వైసీపీ కూసాలు కదిలేలా ఉంటుందని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.

ఎమ్మెల్సీ ఎన్నిక ముందు వైసీపీకి భారీ షాక్

Updated Date - Aug 12 , 2024 | 07:51 PM

Advertising
Advertising
<