ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSRCP Manifesto: వైసీపీ మేనిఫెస్టో వచ్చేసింది.. ఓ లుక్కేయండి..!

ABN, Publish Date - Apr 27 , 2024 | 11:53 AM

ఆంధ్రప్రదేశ్‌‌లో సార్వత్రిక ఎన్నికలకుగాను (AP Elections) నామినేషన్ల పర్వం ముగియడంతో.. గెలుపోటములను నిర్ణయించే మేనిఫెస్టో రిలీజ్ చేసే పనిలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. అదిగో మేనిఫెస్టో.. ఇదిగో మేనిఫెస్టో (YSRCP Manifesto) అంటూ కొద్దిరోజులుగా హడావుడి చేసిన వైసీపీ (YSR Congress) ఎట్టకేలకు శనివారం (ఏప్రిల్-27న) రిలీజ్ చేసింది.

తీవ్ర అసంతృప్తి!

  • జగన్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై వైసీపీలో తీవ్ర అసంతృప్తి!

  • మేనిఫెస్టో విషయంలో అగ్రనేతలు, ముఖ్యనేతల..

  • మాటలను జగన్ రెడ్డి లెక్క చేయలేదని టాక్

  • మేనిఫెస్టోపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు

  • సోషళ్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు

  • అబ్బే అస్సలు బాగోలేదని కొందరు.. అదేంలేదు అమలు చేసేవే చెప్పారని మరికొందరు

  • మేనిఫెస్టోపై మిశ్రమ స్పందన రావడంతో కంగుతిన్న వైసీపీ హైకమాండ్!

  • అమలు చేసే హామీలు ఇచ్చానని పదే పదే చెప్పిన వైఎస్ జగన్

  • గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసి హీరోలా జనాల్లోకి వెళ్లానన్న వైసీపీ అధినేత


ఇంతకీ జగన్ మేనిఫెస్టోలో ఏమున్నాయ్..?

  • అమ్మఒడి రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంపు

  • వైఎస్‌ఆర్‌ చేయూత కొనసాగింపు

  • వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం కొనసాగింపు

  • వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం కొనసాగింపు

  • మహిళలకు రూ.3లక్షల వరకు సున్నా వడ్డీ

  • సామాజిక పెన్షన్లను రెండు విడుతల్లో రూ.3,500లకు పెంపు

  • జనవరి 2028, జనవరి 2029లో రెండు విడుతల్లో పెన్షన్‌ పెంపు

  • కల్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగింపు

  • అర్హులందరికీ ఇళ్లు పథకం కొనసాగింపు

  • రూ.2వేల కోట్లతో పట్టణాల్లో ఎంఐజీ ఇళ్లు

  • రైతుభరోసా సొమ్ము రూ.13,500 నుంచి రూ.16వేలకు పెంపు

పెన్షన్లు.. భీమా.. రైతు భరోసా ఇలా!

  • వృద్ధాప్య పెన్షన్లు 2 విడతల్లో రూ.3,500లకు పెంపు

  • మత్స్యకార భరోసా పథకం కొనసాగింపు

  • రైతు భరోసా సొమ్ము రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు

  • ఉచిత బీమా, పంటరుణాలు కొనసాగింపు

  • వాహనమిత్ర పథకం కొనసాగింపు

  • రాష్ట్రవ్యాప్తంగా 175 స్కిల్‌హబ్‌లు ఏర్పాటు

  • జిల్లాకు ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీ

  • తిరుపతిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వర్సిటీ

  • 500లకుపైగా అవాసాలున్న దళితకాలనీలను పంచాయతీలుగా మారుస్తాం

  • రాజధానిపై జగన్‌ నోట అదే పాట.. మళ్లీ మూడు ముక్కలాట


2 పేజీలు, 9 హామీలు (01:15 PM, 27th ఏప్రిల్ 2024)

  • చేయూత పథకానికి నాలుగు విడతల్లో..

  • 75 వేల నుంచి లక్షా 50వేలకు పెంపు

  • వైఎస్సార్‌ కాపునేస్తం నాలుగుదఫాల్లో..

  • 60 వేల నుంచి లక్షా 20వేలకు పెంపు

  • అమ్మఒడి రూ.15 వేల నుంచి రూ.17వేలకు పెంపు

  • వైఎస్సార్‌ సున్నావడ్డీ కింద 3లక్షలు వరకు రుణాలు

  • రెండు విడతల్లో పెన్షన్‌ రూ.3500లకు పెంపు

  • అర్హులై ఇళ్ల స్థలాలు లేని వారందరికీ ఇళ్లు

  • వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం నాలుగు దఫాల్లో..

  • 45వేల నుంచి లక్షా 5వేల వరకు పెంపు

  • వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగుతుంది : వైఎస్ జగన్


మేనిఫెస్టో విడుదల

  • మేనిఫెస్టో విడుదల చేసిన వైఎస్ జగన్

  • కేవలం రెండు పేజీలతోనే మేనిఫెస్టో రిలీజ్

  • చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామన్న జగన్


కోట్లు పంచాం.. లెక్కలివిగో..! (12:40 PM, 27th ఏప్రిల్ 2024)

  • రూ. 2.70 లక్షల కోట్లు లబ్ధిదారులకు పంచాం

  • నేరుగా వాళ్ల ఖాతాల్లోనే వేశాం

  • మా పాలనకు గత పాలకులకు మధ్య తేడా గమనించండి

  • నా పాదయాత్రలో పేదల పరిస్థితి దగ్గరగా చూశాను

  • కోవిడ్ సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైంది

  • అయినా ఎలాంటి సాకులు చూపకుండా పథకాలు ఇచ్చాం

  • కష్టాలు ఎదురైనా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాం

  • డీబీటీ-నాన్‌డీబీటీ ద్వారా అమలు చేశాం

  • దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా..

  • సీట్లలో సామాజిక న్యాయం పాటించాం

  • విద్య, వైద్య రంగాల్లో కనీవినీ ఎరుగని మార్పులు చేశాం

  • పరిపాలన అంటే ఏంటి.. ఎలా ఉంటుందనేది చూపాం : జగన్


మధ్యలో ఈయన ప్రస్తావన ఎందుకో..? (12:25 PM, 27th ఏప్రిల్ 2024)

  • మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా సీఎంవో అధికారి..

  • ధనుంజయ్‌రెడ్డి పేరు ప్రస్తావించిన సీఎం జగన్‌

  • మేమిఫెస్టోను 99.5% అమలు చేశాం అంతేనా..?

  • ధనుంజయ్ అంటూ సీఎం ప్రస్తావన

  • కనుబొమ్మ మీద స్టిక్కర్ తీసేసిన సీఎం జగన్‌

  • జగన్ గులకరాయి దెబ్బమాయం..

  • కుట్లు కూడా కనిపించకుండా మానిపోయిన వైనం

  • గాయానికి కుట్లు వేశామన్న వైద్యులు

  • కుట్ల ఆనవాళ్ళు ఏమయ్యాయి? అంటూ చర్చ


చంద్రబాబు రియాక్షన్ (12:15 PM, 27th ఏప్రిల్ 2024)

  • వైసీపీ మేనిఫెస్టో విడుదలపై ఇప్పటికే ట్విట్టర్‌లో స్పందించిన చంద్రబాబు

  • మద్య నిషేధం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతావు జగన్‌రెడ్డి?

  • మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నావు

  • వాటిల్లో ఏ ఒక్కదాని మీదైనా నీకు గౌరవం ఉన్నా..

  • 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్లు మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివి!

  • మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్న నువ్వు...

  • ఏ మొఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టో విడుదల చేసి ఓట్లు అడుగుతావు? : చంద్రబాబు


అడ్డంగులు.. అన్నీ కోతలే! (11:40 AM, 27th ఏప్రిల్ 2024)

  • వైఎస్సార్‌ చేయూత, ఆసరా వంటి పథకాల్లో..

  • ఆరు దశల్లో అడ్డంకులు సృష్టించి లబ్ధిదారులకు కోత వేసిన సర్కార్

  • పేదలందరికీ ఇల్లు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి..

  • అతితక్కువ ఇళ్లు మాత్రమే కట్టించిన జగన్ సర్కార్

  • ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని..

  • జాబ్ క్యాలెండర్‌ ఏటా ఇస్తామని మరో మోసం

  • ఇప్పుడు మరో మోసకారి మేనిఫెస్టో జగన్ విడుదల చేస్తున్నారని విపక్షాల మండిపాటు

  • సంక్షేమ పథకాల పేరుతో రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారంటూ అవేదన

  • ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ సకాలంలో..

  • బిల్లులు చెల్లించకపోవడం వల్ల పేదలకు అందని వైద్యం

  • ఆరోగ్యశ్రీ పథకానికి సకాలంలో నిధులు కేటాయించకుండా..

  • రూ.25లక్షలకు పరిధి పెంచినా ప్రయోజనం లేదంటున్న లబ్ధిదారులు


బ్యాండేజీ తీసేసిన జగన్.. అన్నీ మోసాలే..! (11:30 AM, 27th ఏప్రిల్ 2024)

  • వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న సీఎం జగన్‌

  • బస్సుయాత్ర పూర్తి కావడంతో బ్యాండేజీ తీసేసిన జగన్‌

  • గత మేనిఫెస్టోలో 99% హామీలు నెరవేర్చామంటూ పచ్చి అబద్ధాలు

  • సంపూర్ణ మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతామన్న జగన్‌రెడ్డి

  • మద్యం ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్న వైసీపీ

  • మద్యం ధరలు భారీగా పెంచి, నాసిరకం మద్యం అమ్ముతూ..

  • పేదల ప్రాణాలు తీస్తూ 4 రెట్లు ఆదాయాన్ని పొందుతున్న జగన్ సర్కార్

  • సీపీఎస్‌ను రద్దు చేస్తామంటూ గత ఎన్నికలకు ముందు ఉద్యోగులకు మోసం

  • ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని నిరుద్యోగులకు మొండిచేయి చూపించిన జగన్

  • మెగా డీఎస్సీ పేరు చెప్పి దగా డీఎస్సీ వేసిన జగన్‌

  • రైతుభరోసా పేరుతో రైతులకు ఇస్తామన్న డబ్బుల్లో..

  • కేంద్ర ప్రభుత్వం వాటాను కలిపి ఇస్తూ మరో మోసం

  • అమ్మఒడి డబ్బుల్లో సైతం రూ.2వేలు కోతలు వేస్తూ..

  • కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే అమ్మఒడి వేస్తుండడం ద్వారా వైఎస్ జగన్ మరో మోసం


హీరోలా జనాల్లోకి వెళ్తున్నా..! (11:25 AM, 27th ఏప్రిల్ 2024)

  • తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో మేనిఫెస్టో విడుదల చేస్తున్న వైఎస్ జగన్

  • మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించాం

  • ప్రతి ఏడాది తర్వాత ప్రోగ్రోస్ రిపోర్టుతో ప్రజలకు వివరించాం

  • ఎన్నికలప్పుడు రంగురంగుల డాక్యుమెంట్లతో ముందుకు వచ్చేవారు

  • అమలు చేసినా చేయకున్నా.. చంద్రబాబులాగా హామీలు ఇచ్చేద్దామని చాలా మంది నాకు చెప్పారు.

  • నేను సాధ్యమయ్యే హామీలే ఇచ్చి అమలు చేసి.. ప్రజల్లోకి ఒక హీరోలా వెళ్తున్నా

  • వారికి, మాకు ఉన్న తేడాను ప్రజలు గమనించాలి.

  • మేనిఫెస్టో అనేది పవిత్రమైన గ్రంథం

  • లీడర్‌షిప్ అంటే.. చెప్పిన ప్రతిమాట అమలు చేస్తూ ముందుకెళ్లడమే..

  • 99 శాతం పైచిలుకు మేనిఫెస్టోను అమలు చేశాం

  • మేనిఫెస్టో ప్రతి ప్రభుత్వ అధికార ఉంది

  • పథకాలకు క్యాలెండర్ విడుదల చేసిన చరిత్ర లేదు

  • 58 నెలల్లో 99 శాతం హామీలు అమలు చేశాం

  • నేరుగా ఇంటికే పథకాలు డోర్ డెలివరీ చేశాం

  • చేయగలిగినవి మాత్రమే నేను చెప్పా..

  • చరిత్రలో హీనుడిగా మిగలదలుచుకోలేదు.. ఇచ్చినమాట నిలబెట్టుకుని హీరోగా ఉండాలనుకున్నా

  • చెప్పినవన్నీ అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నా

  • రూ. 2.70 లక్షల కోట్లు లబ్ధిదారులకు పంచాం : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి


రెడీ.. వన్.. టూ.. త్రీ! (11:20 AM, 27th ఏప్రిల్ 2024)

  • మేనిఫెస్టో విడుదల చేస్తున్న వైఎస్ జగన్

  • మనం మేనిఫెస్టోను అమలు చేసిన తీరు..

  • చరిత్రలో నిలిచిపోతుంది

  • గత ఐదేళ్లలోనే మేనిఫెస్టోకు కావాల్సిన గుర్తింపు వచ్చింది

  • ప్రతి ఏడాది తర్వాత ప్రొగ్రెస్ రిపోర్టుతో ప్రజలకు వివరించాం

  • ఈ 58 నెలల్లోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చింది

  • నాయకుడిని నమ్మి ప్రజలు ఓటు వేస్తారు.. ఆ నమ్మకాన్ని నాయకుడు నిలబెట్టుకోవాలి : వైఎస్ జగన్


మేనిఫెస్టో వచ్చేస్తోంది..! (11:10 AM, 27th ఏప్రిల్ 2024)

ఆంధ్రప్రదేశ్‌‌లో సార్వత్రిక ఎన్నికలకుగాను (AP Elections) నామినేషన్ల పర్వం ముగియడంతో.. గెలుపోటములను నిర్ణయించే మేనిఫెస్టో రిలీజ్ చేసే పనిలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. అదిగో మేనిఫెస్టో.. ఇదిగో మేనిఫెస్టో (YSRCP Manifesto) అంటూ కొద్దిరోజులుగా హడావుడి చేసిన వైసీపీ (YSR Congress) ఎట్టకేలకు శనివారం (ఏప్రిల్-27న) రిలీజ్ చేసింది. 2019 ఎన్నికల్లో నవరత్నాలు, మరికొన్ని అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన వైసీపీ.. ఏ మేరకు అమలు చేసిందనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. అయితే.. మాట తప్పం.. మడమ తిప్పమన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అధికారంలోకి వచ్చిన తర్వాతనే నాలుక మడతేసి.. మడమ కూడా తిప్పేశారన్నది ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇక అభివృద్ధి అంటారా..? అబ్బే దాని ఊసే లేదన్నది మేధావులు చెబుతున్న మాటలు. మూడు రాజధానులు అని ఉన్న రాజధానిని పక్కనెట్టిన జగన్.. ఒక్క బిల్డింగ్ అయినా కట్టిన దాఖలాలున్నాయా అంటే కూల్చుడు తప్ప కట్టడం అనే మాటే లేదు.


ఏముండబోతున్నాయ్..?

ఈ ఎన్నికల్లో కూడా అంతకుమించి హామీలు ఇచ్చి అధికారంలోకి రావడానికి విశ్వప్రయత్నాలే చేస్తోంది. ఈసారి డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీపైనే ఎక్కువ దృష్టి సారించే అవకాశాలు మెండుగా ఉన్నాయని కొద్దిరోజులుగా పెద్ద చర్చే జరుగుతోంది. మరోవైపు.. యువతను టార్గెట్ చేస్తూ కూడా మేనిఫెస్టోలో కొన్ని కీలక హామీలు ఉంటాయని తెలుస్తోంది. ఇక గత ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాలులోని ప్రతి పథకానికి ఇచ్చే నగదును మరింత పెంచే అవకాశముందని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దీంతో అసలు మేనిఫెస్టోలో ఏం ఉండబోతోంది..? అనేదానిపై కేడర్, ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read More Andhra Pradesh and Telugu News Here

Updated Date - Apr 27 , 2024 | 02:31 PM

Advertising
Advertising