Viral Video: చనిపోవడానికి వచ్చి రైలు పట్టాల మధ్యలో నిద్రపోయిన యువతి..!
ABN, Publish Date - Sep 11 , 2024 | 09:44 AM
మైందో ఏమో గానీ.. ఓ యువతి చనిపోతానంటూ నేరుగా రైలు పట్టాలపైకి వెళ్లింది. ట్రైన్ కోసం ఎదురు చూసింది. అరగంట.. గంట.. అయినా ట్రైన్ రాలేదు. ఎదురు చూసి.. ఎదురు చూసి విసిగిపోయిన ఆ అ అమ్మాయి చివరకు ట్రైన్ పట్టాలపైనే ఆదమరిచి నిద్రపోయింది.
పాట్నా, సెప్టెంబర్ 11: ఏమైందో ఏమో గానీ.. ఓ యువతి చనిపోతానంటూ నేరుగా రైలు పట్టాలపైకి వెళ్లింది. ట్రైన్ కోసం ఎదురు చూసింది. అరగంట.. గంట.. అయినా ట్రైన్ రాలేదు. ఎదురు చూసి.. ఎదురు చూసి విసిగిపోయిన ఆ అ అమ్మాయి చివరకు ట్రైన్ పట్టాలపైనే ఆదమరిచి నిద్రపోయింది. మరి చివరికి ఏమైంది? ట్రైన్ వచ్చిందా? ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? తెలియాలంటే పూర్తి కథనం చదవాల్సిందే..
అమ్మ తిట్టిందని ఆత్మహత్య.. నాన్న మందలించాడని ఆత్మహత్య.. పరీక్ష ఫెయిల్ అయ్యామని ఆత్మహత్య.. ప్రేమ విఫలమైందని ఆత్మహత్య.. అప్పులని ఆత్మహత్య.. కుటుంబ కలహాలని ఆత్మహత్య.. ప్రతి సమస్యకు ఆత్మహత్యే శరణ్యమైపోయింది ప్రజలకు. ధైర్యంగా నిలబడి సమస్యను ఎదుర్కొనే మానసిక స్థ్యైర్యం ప్రజల్లో కొరవడింది. చిన్న చిన్న విషయాలకు సైతం బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అమ్మాయి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ, సమయానికి పట్టాలపై ఉన్న ఆ అమ్మాయిని ట్రైన్ లోకో పైలెట్ చూడటంతో ప్రమాదం తప్పింది. బతికి బయటపడింది.
బీహార్‌లోని చాకియా రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువతి చనిపోవాలని నిర్ణయించుకుని ట్రైన్ పట్టాల మీద పడుకుంది. చాలా సమయం గడిచినా ట్రైన్ రాలేదు. ఎదురు చూసి ఎదురు చూసి విసిగిపోయిన యువతి.. ట్రైన్ పట్టాల మధ్యలోనే ఆదమరిచి నిద్రపోయింది. ఇంతలో ట్రైన్ రానే వచ్చింది. అమ్మాయి ట్రైన్ పట్టాలపై పడుకుని ఉండటాన్ని ట్రైన్ లోకో పైలెట్ గుర్తించాడు. వెంటనే ట్రైన్‌ను ఆపేశారు. ట్రైన్ నుంచి కిందకు దిగి.. అమ్మాయిని నిద్ర లేపారు. చనిపోవడానికి వచ్చి నిద్రపోయానని ఆ అమ్మాయి చెప్పింది. ఇది విన్న లోకోపైలెట్ షాక్ అయ్యాడు. ట్రైన్ ట్రాక్స్ పక్కనే ఇళ్లు ఉండగా.. అక్కడి వారికి సమాచారం అందించి.. అమ్మాయిని పంపించేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది.
Also Read:
ఇవాళ గుంటూరు జిల్లా జైలుకు వైఎస్ జగన్.. ఎందుకంటే?
ఏలూరు జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన..
ఢిల్లీలో కీలక భేటీ.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ఏ నిర్ణయం
For More Trending News and Telugu News..
Updated Date - Sep 11 , 2024 | 09:44 AM