Viral: భార్య తనకు సొంత చెల్లెలు అవుతుందని పెళ్లైన 6 ఏళ్లకు తెలిసి..
ABN , Publish Date - Mar 08 , 2024 | 03:09 PM
భార్య తనకు సొంత చెల్లెలు అవుతుందని తెలిసి భర్తకు షాక్ . నెట్టింట తన ఆవేదనను పంచుకున్న వైనం
ఇంటర్నెట్ డెస్క్: అనారోగ్యంతో ఉన్న భార్యను కాపాడుకునేందుకు కిడ్నీ దానం చేద్దామనుకున్నాడో వ్యక్తి. కానీ, ఈ ఆలోచనే చివరకు అతడి జీవితాన్ని తలకిందులు చేసింది. బ్రిటన్‌లో (Britain) వెలుగు చూసిన ఓ ఉదంతం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా (Viral) మారింది. ది మిర్రర్ పత్రిక ప్రచురించిన వివరాల ప్రకారం, ఓ వ్యక్తి భార్య ప్రసవం తరువాత తీవ్ర అనారోగ్యం పాలైంది. మహిళ కిడ్నీలు పని చేయకపోవడంతో ఆమె భర్త కిడ్నీ దాతల గురించి వెతకడం ప్రారంభించాడు. తమ బంధువులు అందరినీ సంప్రదించినా ఒక్కరి కిడ్నీ కూడా తన భార్యకు సరిపోలేదు (Man finds out wife is his sister).
దీంతో, అతడు తనే స్వయంగా భార్యకు కిడ్నీ దానం చేసేందుకు (Kidney Donation) ముందుకొచ్చాడు. తన కిడ్నీ భార్యకు సరిపోయే అవకాశాలు తక్కువని తెలిసీ చివరి ప్రయత్నంగా ఇందుకు సంబంధించిన కొన్ని పరీక్షలు చేయించుకున్నాడు. ఈ క్రమంలో తన కిడ్నీ భార్యకు మ్యాచ్ అయిందని వైద్యులు చెప్పడంతో అతడు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాడు.
‘‘ఇటీవల ఓ రోజు ఆసుపత్రి నుంచి నాకు కాల్ వచ్చింది. నా కిడ్నీ ఆమెకు (భార్య) మ్యాచ్ అయ్యిందని డాక్టర్లు చెప్పారు. కానీ హెచ్ఎల్ఏ టెస్టు కూడా చేయించుకోవాలని డాక్టర్లు చెప్పారు. ఆ తరువాత పరీక్ష జరపగా వచ్చిన ఫలితం చూసి షాకైపోయా. నాకు, నా భార్యకు మధ్య జన్యుపరంగా చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఈ టెస్టులో సాధారణంగా తల్లిదండ్రులు బిడ్డల మధ్య పోలీక కనీసం 50 శాతం ఉంటుంది. తొడబుట్టిన వాళ్ల మధ్య ఈ పోలీక 0 నుంచి 100 శాతం వరకూ ఉండొచ్చు. కానీ మా మధ్య కూడా తొడబుట్టిన వారికి లాగా జన్యుపరమైన దగ్గర పోలిక ఉంది’’ అని అతడు చెప్పుకొచ్చాడు. తన తల్లిదండ్రులు తనను దత్తత తీసుకున్నారని, అసలు కన్నవారెవరో తనకు తెలీదని (Closed Adoption) చెప్పుకొచ్చాడు.
Viral Video: ఆటోలో వెళ్తున్న యువతిని ఫోన్ నంబర్ అడిగిన కుర్రాళ్లు.. చివరకు చూస్తుండగానే..
ఇప్పుడు తనకు ఏం చేయాలో అర్థం కావట్లేదంటూ ప్రముఖ చర్చావేదిక రెడిట్‌లో తన ఆవేదన అంతా పంచుకున్నాడు. అయితే నెటిజన్లను మాత్రం అతడిని ఓదార్చే ప్రయత్నం చేశారు. వారి పిల్లలకు ఎటువంటి జన్యుపరమైన రోగాలు లేవు కాబట్టి చింతించాల్సింది ఏమీ లేదని చెప్పుకొచ్చారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి