ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇంటి ముందు మృత్యుబావిలో పడిన బాలిక.. తల్లి కేకలు పెడుతున్నా ఫలితం శూన్యం.. చివరకు..

ABN, Publish Date - Jul 04 , 2024 | 07:51 PM

కొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం ఇంకొందరికి ప్రాణసంకటం అవుతుంటుంది. నిత్యం మన చుట్టూ అధికారులు వివిధ రకాల పనులు చేపడుతుంటారు. అయితే వాటి నిర్వహణలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలో...

కొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం ఇంకొందరికి ప్రాణసంకటం అవుతుంటుంది. నిత్యం మన చుట్టూ అధికారులు వివిధ రకాల పనులు చేపడుతుంటారు. అయితే వాటి నిర్వహణలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మందికి ఇది సమస్యగా మారుతుంటుంది. ఇంకొన్నిసార్లు ప్రమాదకరంగా కూడా మారుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ బాలిక ఇంట్లోకి వెళ్లే సమయంలో ప్రమాదవశాత్తు ఎదురుగా రోడ్డుపై తవ్విన పెద్ద గొయ్యిలో పడిపోతుంది. ఇది చూసి తల్లి కేకలు పెడుతుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) చోటు చేసుకుంది. స్థానిక ఇండోర్‌ చందన్‌నగర్ పరిధి అంబర్‌నగర్‌లోని వార్డ్ నంబర్-1లో అధికారుల రోడ్డుపై గొయ్యి (pit on the road) తవ్వి పూడ్చకుండా వదిలేశారు. ఇంతలో వర్షాలు రావడంతో దాని నిండా వరదనీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన కూతురుతో కలిసి గొయ్యి ఎదురుగా ఉన్న తమ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.

Viral Video: పెళ్లి వేదిక పైకి దూసుకొచ్చిన వరుడి ప్రియురాలు.. చివరకు ఆమె అలా చేయడంతో.. అంతా షాక్..


ముందుగా తల్లి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటి గేటు వద్దకు చేరకుంది. వెనుక వస్తున్న ఆమె కూతురు ప్రమాదవశాత్తు కాలి (girl fell into the pit) జారి గొయ్యిలో పడిపోయింది. బయటికి వచ్చే వీలు లేక నీళ్లలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. మునిగిపోయే క్రమంలో చివరకు ఎలాగోలా ఒడ్డుకు వచ్చి రాళ్లను పట్టుకుని అలాగే ఉండిపోతుంది. కూతురు నీళ్లలో పడిపోవడాన్ని చూసిన తల్లి.. ‘‘కాపాడండి.. కాపాడండి’’.. అంటూ కేకలు పెడుతుంది. అయినా ఎవరూ బాలికను కాపాడేందుకు రారు. ఈ క్రమంలో కాసేపటికి అటుగా వెళ్తున్న ఓ బాలుడు గమనిస్తాడు. వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి బాలికను అతికష్టం మీద పైకి లాగి ప్రాణాలను కాపాడతాడు.

Viral Video: సినిమాటిక్ షాట్ కోసం ఐఫోన్‌ను కాలువలోకి వదిలాడు.. చివరికి షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..


ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు రోడ్డు పనుల కోసం గోతులు తవ్వి పూడ్చకుండా వదిలేస్తున్నారని చెప్పారు. గుంతలు పూడ్చకపోగా.. కనీసం సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. బాలుడు కాపాడకుంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేది’’.. అంటూ కొందరు, ‘‘సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి’’.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఇటుకలతో వాషింగ్‌మెషిన్.. ఈమె తెలివి మామూలుగా లేదుగా..

Updated Date - Jul 04 , 2024 | 07:51 PM

Advertising
Advertising