Viral Video: తెలిసి తప్పు చేయడమంటే ఇదే.. రైలుకు వేలాడుతున్న యువతి.. చూస్తుండగానే..
ABN, Publish Date - Dec 13 , 2024 | 11:27 AM
బస్సు, రైలు ప్రయాణాల్లో చాలా మంది తెలిసి తెలిసి తప్పులు చేస్తుంటారు. అయినా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉంటారు. కొందరు యువతులు అయితే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. రీల్స్ పిచ్చిలో యువకులతో పోటీ పడి మరీ ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో కొందరికి షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి..
బస్సు, రైలు ప్రయాణాల్లో చాలా మంది తెలిసి తెలిసి తప్పులు చేస్తుంటారు. అయినా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉంటారు. కొందరు యువతులు అయితే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. రీల్స్ పిచ్చిలో యువకులతో పోటీ పడి మరీ ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో కొందరికి షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. రైలు డోరు వద్ద ప్రమాదకంరగా వేలాడుతూ ప్రకృతి అందాలను వీక్షిస్తుండగా మధ్యలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘తెలిసి తెలిసి తప్పు చేయడమంటే ఇదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. శ్రీలంకలోని కొలంబోలో (Sri Lanka Colombo) ఈ ఘటన చోటు చేసుకుంది. చైనాకు చెందిన ఓ యువతి (Chinese Young women) పర్యటనలో భాగంగా కొలంబోకు వచ్చింది. ఆదివారం కొలంబోలో రైలు ప్రయాణం చేస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పర్యాటకులంతా రైల్లో వెళ్తూ ప్రకృతి అందాలను వీక్షిస్తున్నారు. రైలు వెల్లవత్తె- బంబలపిటి మధ్య వెళ్తుండగా ఉన్నట్టుండి అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
చైనా యువతి డోరు వద్ద ప్రమాదకరంగా వేలాడుతూ ప్రకృతి అందాలను వీక్షిస్తోంది. రెండు చేతులతో డోరు వద్ద ఉన్న ఇనుప రాడ్లు పట్టుకుని వేలాడింది. కళ్ల మూసుకుని రైడ్‌ను ఎంజాయ్ చేస్తుండగా.. మధ్యలో ఒక్కసారిగా చెట్టు కొమ్మలు తగిలి (young woman fell from the train) ధబేల్‌మని కిందపడిపోయింది. దీంతో అప్పటిదాకా ఆమెను వీడియో తీస్తున్న వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పొదల్లో పడిపోయిన ఆమెను పోలీసులు రక్షించి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Optical Illusion Personality Test: మీరు కూర్చునే భంగిమ.. మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని తెలుసా..
రైలు ప్రయాణాల్లో ఇలాంటి విన్యాసాలు ఎవరూ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రమాదకరం’’.. అంటూ కొందరు, ‘‘తెలిసి కూడా తప్పులు చేయడమంటే ఇదే’’ అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: వామ్మో.. అడవి కుక్క దాడి మామూలుగా లేదుగా.. జింకను ఎలా వేటాడిందో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 13 , 2024 | 01:29 PM