ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: క్వార్టర్ కొడితే ఇలాగే ఉంటుందేమో.. పాముతోనే ఫన్నీ గేమ్స్.. చివరకు జరిగింది చూస్తే..

ABN, Publish Date - Jul 25 , 2024 | 07:58 PM

కొందరు మందుబాబులు మద్యం తాగితే ప్రపంచాన్నే మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. మరికొందరు మందు కొడితే ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటారు. ఇంకొందరు రోడ్లపై వాహనాలను ఆపుతూ నానా హంగామా చేస్తుంటారు. ఇలాంటి...

కొందరు మందుబాబులు మద్యం తాగితే ప్రపంచాన్నే మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. మరికొందరు మందు కొడితే ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటారు. ఇంకొందరు రోడ్లపై వాహనాలను ఆపుతూ నానా హంగామా చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మందుబాబు వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఫుల్‌గా మందు కొట్టిన ఓ వ్యక్తి.. పాముతో ఫన్నీ గేమ్స్ ఆడాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) సత్యసాయి జిల్లా కదిరిలో చోటు చేసుకుంది. నాగరాజు అనే ఓ యువకుడు ఫుల్‌గా మందు తాగి (drunken man) .. స్థానిక డిగ్రీ కళశాల సమీపంలోని రోడ్డు పైకి వచ్చాడు. అదే సమయంలో అతడికి ఓ నాగుపాము కనిపించింది. దాన్ని చూడగానే అతడిలో మరో వ్యక్తి నిద్రలేచాడు.

Viral Video: ఈ గొరిల్లా గొప్ప మనసు చూస్తే అవాక్కవ్వాల్సిందే.. ఫోన్ పడిపోయిందని తెలుసుకుని..


అందరి ముందూ హీరోలా బిల్డప్ ఇస్తూ పామును పట్టుకుని రోడ్డుపైకి తీసుకెళ్లాడు. అక్కడ దాంతో ఫన్నీ గేమ్స్ ఆడాడు. బుసలు కొడుతున్న పామును పదే పదే రెచ్చగొడుతూ రాక్షసానందం పొందాడు. ఈ క్రమంలో పాము (cobra bit a drunken man) అతడి చేతిపై కాటేసింది. దీంతో ఒక్కసారిగా షాకైన యువకుడు.. చేతిని గట్టిగా విదిలించుకున్నాడు. అప్పటికైనా పామును వదలి పక్కకు పోవాల్సింది పోయి.. మళ్లీ పామును కాలితో తన్నుతూ అలాగే ప్రవర్తించాడు. ఇతడి నిర్వాకం చూసి చుట్టూ ఉన్న వారంతా షాక్ అయ్యారు.

Viral Video: ఇది లిఫ్ట్ గదా.. లేక శవపేటికా.. అవాక్కవుతున్న నెటిజన్లు..


చేసేదేమీలేక దూరంగా నిలబడి అలాగే చూస్తుండిపోయారు. చివరకు కొందరు కలుగుజేసుకుని అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పాములతో ఇలా గేమ్స్ ఆడితే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారికి ఇలాగే జరగాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 47వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పెళ్లి వేదికపై వరుడి పక్కనే వధువు ఏడుపు.. ఓదార్చిన స్నేహితులు.. కారణమేంటని విచారించగా..

Updated Date - Jul 25 , 2024 | 07:58 PM

Advertising
Advertising
<