ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral news: బస్సు డోర్ దగ్గర నిల్చోవద్దనందుకే కత్తితో... బాబోయ్ వీడు మరీ ఇలా ఉన్నాడేంటి..

ABN, Publish Date - Oct 02 , 2024 | 08:22 PM

జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన హర్ష్ సిన్హా అనే యువకుడు బెంగళూరులో నివసిస్తున్నాడు. పని నిమిత్తం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అయితే అతను ఫుట్ బోర్డుపై ఉండడంతో బస్ డోర్లు మూసుకుపోతాయని లోపలికి రావాల్సిందిగా కండక్టర్ యోగేశ్ అతణ్ని కోరాడు.

బెంగళూరు: పేదలు, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఆర్టీసీ బస్సు్ల్లో ప్రయాణించేందుకు ఇష్టపడుతుంటారు. అలాగే పట్టణాలు, నగరాలకు చెందిన విద్యార్థులు సైతం బస్ పాస్‌లు తీసుకుని మరీ ప్రయాణం చేస్తుంటారు. అయితే విద్యార్థులు వారి వయస్సు రీత్యా, సరదా కోసం ఎక్కువగా ఫుట్ బోర్డులపై నిలబడుతుంటారు. అలాంటి సందర్భాల్లో కండక్టర్ వారిని హెచ్చరిస్తుంటాడు. తాజాగా ఓ కండక్టర్ అలా హెచ్చరించే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఓ యువకుణ్ని ఫుట్ బోర్డుపై ఉండొద్దని చెప్పడంతో కోపోద్రిక్తుడైన అతడు కండక్టర్‌పై కత్తితో దాడి చేశాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.


జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన హర్ష్ సిన్హా అనే యువకుడు బెంగళూరులో నివసిస్తున్నాడు. పని నిమిత్తం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అయితే అతను ఫుట్ బోర్డుపై ఉండడంతో బస్ డోర్లు మూసుకుపోతాయని లోపలికి రావాల్సిందిగా కండక్టర్ యోగేశ్ అతణ్ని కోరాడు. అయితే యువకుడు ఏమాత్రం పట్టించుకోకుండా అలానే ఉండిపోయాడు. యోగేశ్ అతణ్ని లోపలికి రావాల్సిందిగా పలుమార్లు కోరాడు. దీంతో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన యువకుడు లోపలికి వచ్చి సీట్లో కూర్చున్నాడు. అనంతరం ఏమనుకున్నాడో ఏంటో గానీ ఒక్కసారిగా తన బ్యాగ్‌లో ఉన్న కత్తి తీసుకుని అరుచుకుంటూ వచ్చి కండక్టర్‌పై దాడి చేశాడు. దీంతో యోగేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన చూసిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నిందితుడు హర్ష్ సిన్హా కేకలు వేస్తూ ప్రయాణికులను సైతం మారణాయుధంతో బెదిరించాడు. కిందకు వెళ్లిపోవాలని హెచ్చరించాడు. ఈ ఘటనతో వారంతా బస్సు నుంచి పరుగులు తీశారు.


అయితే డ్రైవర్ సిద్దలింగస్వామి మాత్రం తెలివిగా బస్ డోర్లు మూసేసి కిందికి దూకేశాడు. బయటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో యువకుడు బస్సు అద్దాలను పదేపదే తన్ని బయటకు పారిపోయేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అనంతరం తన బ్యాగ్‌లో నుంచి పెద్ద సుత్తిని తీసి బస్సు అద్దాలను ధ్వంసం చేసి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే సుత్తి విరిగిపోవడంతో ఆ ప్రయత్నమూ విఫలమైంది. మెుత్తం వ్యవహారానికి సంబంధించిన దృశ్యాలు బస్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అయితే దాడికి సంబంధించిన సమాచారాన్ని సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు హర్ష్ సిన్హాను అదుపులోకి తీసుకున్నారు. యోగేష్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి ప్రాణాపాయం లేదని, చికిత్స పొందుతున్నట్లు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ తెలిపింది.


మరోవైపు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడి పరిస్థితి గురించి వివరించారు. హర్ష్ సిన్హాను బీపీవో సంస్థ మూడు వారాల కిందట ఉద్యోగం నుంచి తొలగించిందని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో అతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు వెల్లడించారు. అందువల్లనే అతను దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. మనస్తాపం కారణంగానే బ్యాగ్‌లో ఆయుధాలు పెట్టుకుని తిరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు.

Updated Date - Oct 02 , 2024 | 08:22 PM