ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇలాంటి డ్రైవర్లు ఉంటే ప్రమాదాలే జరగవేమో.. కారును ఎలా రివర్స్ చేస్తున్నాడో చూస్తే అవాక్కవడం ఖాయం..

ABN, Publish Date - Jul 16 , 2024 | 05:29 PM

డ్రైవింగ్ సమయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు కారణమవుతుంటారు. కొందరైతే ప్రమాదమని తెలిసి కూడా వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతూ తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారి మరణానికి కూడా కారణమవుతుంటారు. అయితే...

డ్రైవింగ్ సమయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు కారణమవుతుంటారు. కొందరైతే ప్రమాదమని తెలిసి కూడా వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతూ తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారి మరణానికి కూడా కారణమవుతుంటారు. అయితే కొందరు మాత్రం ఎంతో నైపుణ్యంతో డ్రైవింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కారును రివర్స్‌లో నడిపిన విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇలాంటి డ్రైవర్లు ఉంటే ప్రమాదాలే జరగవేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వాహనాలను పార్కింగ్ (Vehicle parking) చేసే సమయంలో చాలా మంది తెగ ఇబ్బంది పడిపోతుంటారు. చాలినంత స్థలం ఉన్నా కూడా వాహనాలను పార్క్ చేసే సమయంలో పక్క వాహనాలను ఢీకొడుతుంటారు. అయితే కొందరి డ్రైవింగ్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, ఓ వ్యక్తి కారును పార్క్ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: కుండపోత అంటే ఇదేనేమో.. 12 సెకన్ల వీడియో చూస్తే..


వరుసగా పార్క్ చేసి ఉన్న కార్ల పక్కన మరో కారు పట్టేంత స్థలం ఉంది. అయితే ఆ పక్కనే రోడ్డు మీద ఇంకో కారు ఉండడం వల్ల పార్కింగ్ స్థలంలోకి వెళ్లలేని పరిస్థితి. అయితే ఓ కారు డ్రైవర్ తన వాహనాన్ని దూరం నుంచి రివర్స్ చేసుకుంటూ అక్కడికి వచ్చాడు. రెండు వాహనాల మధ్య ఉన్న కొద్దిపాటి స్థలంలో తన కారును ఎంతో చాకచక్యంగా రివర్స్ చేశాడు. ఇలా చివరకు పార్కింగ్ స్థలంలోకి (car Reverse parking in narrow space) తన కారును అవలీలగా తెచ్చేశాడు.

Viral Video: నట్టు, బోల్టును ఇలాక్కూడా వాడొచ్చా.. తలుపులతో ఇతడు చేసిన ప్రయోగం చూడండి..


ఈ క్రమంలో పక్కన ఉన్న వాహనాలకు కొంచెం కూడా తాకకుండా ఎంతో నైపుణ్యంతో వాహనాన్ని నడిపాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి డ్రైవర్లు ఉంటే ప్రమాదాలే జరగవేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పదే పదే హారన్ కొడుతున్నా.. పట్టాల నుంచి తప్పుకోని వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే..

Updated Date - Jul 16 , 2024 | 05:29 PM

Advertising
Advertising
<