ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: మద్యం మత్తులో డ్రైవింగ్ సీటు దిగి మరీ.. ఇతడు చేసిన డేంజరస్ స్టంట్ చూస్తే..

ABN, Publish Date - Aug 02 , 2024 | 01:27 PM

మద్యం మత్తులో కొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం చూస్తుంటాం. కొందరు ఫుల్‌గా మందు కొట్టి బస్సులు, రైళ్లలో నానా హంగామా చేస్తుంటే.. మరికొందరు వాహనాలతో భయంకర విన్యాసాలు చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటారు. ఇలాంటి ..

మద్యం మత్తులో కొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం చూస్తుంటాం. కొందరు ఫుల్‌గా మందు కొట్టి బస్సులు, రైళ్లలో నానా హంగామా చేస్తుంటే.. మరికొందరు వాహనాలతో భయంకర విన్యాసాలు చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటారు. ఇలాంటి విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి డ్రైవింగ్ సీటు దిగి మరీ డేంజరస్ స్టంట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ముంబైలోని (Mumbai) అంధేరీలో చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫుల్‌గా మందు తాగి (Drunken Man) కారు డ్రైవింగ్ చేశాడు. డ్రైవింగ్ చేయడమే కాదు.. కాస్త దూరం వెళ్లగానే (Car Dangerous Stunt) వాహనం నుంచి దిగి డోరుకు వేలాడాడు.

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..


అలా కారు డోరుకు వేలాడుతూనే స్టీరింగ్‌ను కంట్రోల్ చేస్తూ ముందుకు వెళ్లాడు. ఈ క్రమంలో కారు వేగంగా వెళ్లడం వల్ల రోడ్డుపై అటూ, ఇటూ తిరుగుతూ ఉంది. అయినా అతను అలాగే నిర్లక్ష్యంగా కారుకు వేలాడుతూనే వెళ్లాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కన పార్కు్ చేసి ఉన్న కార్లను ఢీకొని ఆగిపోయింది. ఇలా రద్దీ రోడ్డుపై రాత్రి వేళ ఇతడు చేసిన కారు డేంజరస్ స్టంట్ చూసి స్థానికులు షాక్ అయ్యారు.

Viral Video: బజార్లో దొరికే తేనె అసలైనదేనా.. ఇతడు వాడిన ట్రిక్ చూస్తే..


కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ స్టంట్ చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘రోడ్లపై ఇలాంటి విన్యాసాలు చేసేవారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: సీన్ రివర్స్ అంటే ఇదేనేమో.. ఇంట్లోకి దూరిన చిరుత పులి.. అక్కడే ఉన్న కుక్కలు గమనించడంతో..

Updated Date - Aug 02 , 2024 | 01:27 PM

Advertising
Advertising
<