Hyderabad: టెక్నిక్స్ తెలియకే టెక్ నెక్ పెయిన్!
ABN, Publish Date - Oct 16 , 2024 | 08:08 AM
ఇటీవలి కాలంలో నగరంలో పేరొందిన ఆస్పత్రులకు వస్తున్న ఓపీ కేసుల్లో మరీ ముఖ్యంగా యువతలో అత్యధిక శాతం మెడనొప్పి లేదా వెన్నునొప్పి కేసులే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. గంటల తరబడి మొబైల్, ల్యాప్‌టాప్(Mobile, Laptop)లకు అతుక్కుపోవడం వంటి కారణాలతో టెక్‌నెక్ పెయిన్ బారిన పడుతున్నట్లు తెలిపారు.
- ఆస్పత్రులకు వస్తున్న యువతలో అధిక శాతం మంది మెడనొప్పి బాధితులే
- ఫోన్, ల్యాప్‌టాప్ వినియోగించే విధానం మార్చుకుంటే సమస్యలకు పరిష్కారం
హైదరాబాద్ సిటీ: ఇటీవలి కాలంలో నగరంలో పేరొందిన ఆస్పత్రులకు వస్తున్న ఓపీ కేసుల్లో మరీ ముఖ్యంగా యువతలో అత్యధిక శాతం మెడనొప్పి లేదా వెన్నునొప్పి కేసులే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. గంటల తరబడి మొబైల్, ల్యాప్‌టాప్(Mobile, Laptop)లకు అతుక్కుపోవడం వంటి కారణాలతో టెక్‌నెక్ పెయిన్ బారిన పడుతున్నట్లు తెలిపారు. ఈ పెయిన్ ఎక్కువ కాలం ఉంటే వెన్ను సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందంటున్నారు. మొబైల్, ల్యాప్‌టాప్, ట్యాబ్‌పై గడిపే ప్రతి నిమిషం మెడ నరాలు పట్టేయడానికి కారణమవుతాయని, తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కిం కర్తవ్యం..? నేడు ఏపీకి ఆమ్రపాలి?
మొబైల్‌తో ముడిపడి ఉన్న పనులే ఎక్కువ
రోజువారీ కార్యక్రమాల్లో అధికశాతం మొబైల్‌పైనే ఆధారపడుతున్నాం. నిద్ర లేవడానికి అలారం మొదలు ఆఫీసుకు వెళ్లడానికి క్యాబ్, ఫుడ్ ఆర్డర్, స్నేహితులతో సరదా కబుర్లు, సోషల్ మీడియా సందేశాలు.. ఇలా ప్రతీదానికి మొబైల్ అవసరమే. ఈ సుదీర్ఘ వినియోగమే ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుందంటున్నారు డాక్టర్లు. ఆర్థోపిడీషియన్ బాబు మాట్లాడుతూ.. మనం ఫోన్ పట్టుకునే విధానం, ల్యాప్‌టాప్, ట్యాబ్‌పై పనిచేసే విధానం అనేక సమస్యలకు కారణమవుతుందన్నారు. మణికట్టు నొప్పి, చేతుల నొప్పులు, మెడనొప్పి, నడుంనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. మెడనొప్పి కేసుల్లో అధికశాతం గాడ్జెట్స్ వల్ల వచ్చేవే కావడంతో టెక్ నెక్ లేదా టెక్ట్స్ నెక్ పెయిన్ అని పిలుస్తున్నట్లు తెలిపారు.
మెడనొప్పికి యోగాతో చెక్..
నగరంలో వెన్ను, మెడ సమస్యలతో బాధపడుతున్న యువతలో అధికశాతం మంది యోగా మార్గాన్ని అనుసరిస్తున్నారు. అర్థోపెడిక్ డాక్టర్లను సంప్రదించినా శాశ్వత పరిష్కారం కోసం యోగాతోనే మేలంటున్నారు. యోగా నిపుణులు దశరథ్ మాట్లాడుతూ.. కంప్యూటర్స్, మొబైల్స్‌తో అధికంగా గడిపేవారికి కండరాల్లో బలం తగ్గుతుందన్నారు. ఇది మెడ, భుజాల సమస్యలకు దారితీస్తుందని, ఇలాంటి వారికి సింపుల్ హ్యాండ్, లెగ్ వ్యాయామాలు ఉపయోగపడతాయన్నారు.
టెక్ నెక్ లక్షణాలు
మెడ పట్టేయడం, తలనొప్పి, భుజాల నొప్పి ఉంటే అది టెక్ నెక్ సమస్య కావొచ్చు. ఈ సమస్య ఉన్న వారికి కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. భావోద్వేగాలను నియంత్రించలేకపోవడం వంటి సమస్యలు సైతం ఉత్పన్నమవుతాయి.
మొబైల్‌ను పట్టుకునే విధానం
- ఫోన్‌ను ఎక్కువ సమయం వాడాల్సి వస్తే మొబైల్ స్టాండ్ వినియోగించడం మంచిది. ఇది కళ్లు, నరాలపై ఒత్తిడి తగ్గిస్తుంది.
- మణికట్టును మరీ వంచకుండా, మోచేతులు కొద్దిగా వంచి ఫోన్‌ను నడుం లేదా ఛాతి వరకు తీసుకురావాలి. ఆ పొజిషన్‌లో మొబైల్ పట్టుకుంటే మెడ అధికంగా వంచాల్సిన అవసరం ఉండదు. తద్వారా మెడ నరాలపై ఒత్తిడి తగ్గుతుంది.
- రెండు చేతులతో ఫోన్ పట్టుకుని టైపింగ్ కోసం రెండు బొటనవేళ్లనూ వినియోగిస్తే చేతులపై ఒత్తిడి తగ్గుతుంది.
- కుర్చీలో కూర్చున్నప్పుడు వెన్నుముక నిటారుగా ఉండేలా చూసుకోవడంతో పాటు భుజాలు విశ్రాంతిగా ఉంటే మెడ, భుజాలపై ఒత్తిడి తగ్గుతుంది.
- భుజాలపై ఒత్తిడి తగ్గించుకోవడానికి మోచేతులను డెస్క్‌పై ఉంచాలి.
- ప్రతి 20-30 నిమిషాలకు కనీసం 5 నిమిషాల పాటు బ్రేక్ తీసుకోవడం మంచిది.
ఇదికూడా చదవండి: CM Revanth Reddy: సీఎం సంతకం చేసినా బదిలీల్లేవ్!
ఇదికూడా చదవండి: KTR: విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తున్న సర్కార్
ఇదికూడా చదవండి: తాళం వేస్తే కేసులు.. ఎవరి మాటల్తోనో కవ్వింపు చర్యలొద్దు
ఇదికూడా చదవండి: Gurukulas: గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించాలి
Read Latest Telangana News and National News
Updated Date - Oct 16 , 2024 | 08:08 AM