ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: హైదరాబాద్‌లో ఐస్ యాపిల్ బిర్యానీ యమ క్రేజ్ గురూ.. ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటంటే..

ABN, Publish Date - Apr 13 , 2024 | 06:59 PM

హైదరాబాద్ అనగానే టక్కున గుర్తొచ్చేది బిర్యానీ. ఇక్కడి బిర్యానీకి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు కూడా.. దమ్‌ బిర్యానీ.. కశ్మీరీ డ్రైఫ్రూట్స్‌, లక్నోవీ బిర్యానీ.. సింధీ, మొగలాయి తదితర..

హైదరాబాద్ అనగానే టక్కున గుర్తొచ్చేది బిర్యానీ. ఇక్కడి బిర్యానీకి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు కూడా.. దమ్‌ బిర్యానీ.. కశ్మీరీ డ్రైఫ్రూట్స్‌, లక్నోవీ బిర్యానీ.. సింధీ, మొగలాయి తదితర బిర్యానీలను అందుబాటులోకి తెస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి బిర్యానీ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ట్రెండింగ్‌గా మారిన కుమారీ అంటీ వద్ద బిర్యానీ టేస్ట్ చేసేందుకు యువత క్యూకట్టారు. అయితే ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్న సందర్భంలో హైదరాబాద్‌లో ఐస్ యాపిల్ బిర్యానీ.. యమ క్రేజీగా మారింది. ఎక్కువ శాతం యువత ఈ వినూత్న బిర్యానీ తినేందుకు ఆసక్తిచూపుతున్నారు.


సోషల్ మీడియాలో ఐస్ యాపిల్ బిర్యానీ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వేసవిలో ఎక్కువగా లభించే తినుబండారాల్లో ఐస్ యాపిల్ అని పిలువబడే తాటి ముంజ ఒకటి. ఎక్కువ మంది ఇష్టపడే ఈ తాటి ముంజలతో బిర్యానీ (Ice Apple Biryani) రెడీ చేశారు. అలాగే ఇదే తాటి ముంజలతో ఐస్ యాపిల్ కర్రీని కూడా సిద్ధం చేశారు. బిర్యానీ మధ్యలో తాటి ముంజల ముక్కలను వేయడం ద్వారా వెరైటీ టేస్ట్ వచ్చిందని భోజన ప్రియులు చెబుతున్నారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఈ బిర్యానీ ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది.

Viral Video: పడుకున్న ఆవులను హింసించాడు.. చూస్తుండగానే అతడికి ఎలాంటి ఫలితం దక్కిందో చూస్తే..

అసలే ఎండలు విపరీతంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ ఐస్ యాపిల్ బిర్యానీ తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ బిర్యానీ తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పెరగడంతో పాటూ లివర్ కూడా ఆరోగ్యంగా ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వెరీ గుడ్ కాంబినేషన్’’.. అంటూ కొందరు, ‘‘తాటి ముంజలు తింటే ఆరోగ్యం ఉంటుంది కానీ.. బిర్యానీ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మొసలి కంటపడిన పాము.. ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించడంతో.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

Updated Date - Apr 13 , 2024 | 07:13 PM

Advertising
Advertising