ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఖంగుతినిపించిన ఫోన్.. అంత్రకియలు నిర్వహిస్తుండగా బతికొచ్చిన వ్యక్తి.. అసలేం జరిగిందంటే..

ABN, Publish Date - Jun 23 , 2024 | 07:30 PM

చోరీకి గురైన ఫోన్.. ఓ కుటుంబాన్ని తికమకపెట్టింది. ఓ వ్యక్తి రైలు కింద పడి చనిపోయాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రతీకాత్మక చిత్రం

చోరీకి గురైన ఫోన్.. ఓ కుటుంబాన్ని తికమకపెట్టింది. ఓ వ్యక్తి రైలు కింద పడి చనిపోయాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహం వద్దనున్న ఫోన్ ఆధారంగా వివరాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సదరు కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో వారు చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే అదే సమయంలో చనిపోయాడనుకున్న వ్యక్తి ప్రాణాలతో అక్కడికి వచ్చాడు. దీంతో గ్రామస్తులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వికారాబాద్ జిల్లాల్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


సోషల్ మీడియలో ఓ వార్త తెగ వైరల్ (Viral News) అవుతోంది. వికారాబాద్ (Vikarabad) జిల్లా తాండూర్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బషీరాబాద్ మండలం నా వంద్గి గ్రామానికి చెందిన పిట్టల ఎల్లప్ప (45) పశువుల కాపరిగా పనిచేసేవాడు. రెండు రోజుల క్రితం ఇంటి నుండి బయటికి వెళ్లాడు. అయితే అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. ఇలావుండగా.. ఫోన్ చోరీ చేసిన వ్యక్తి (train accident) వికారాబాద్ సమీపంలో రైలు కిందపడి చనిపోయాడు. ఈ ప్రమాదంలో అతడి మొఖం పూర్తిగా చిద్రమై ఎవరూ గుర్తుపట్టలేని విధంగా మారింది. రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు.

Viral video: సింహం గాఢ నిద్రలో ఉండగా.. దగ్గరికి వెళ్లిన జింక పిల్ల.. అటూ ఇటూ చూసి చివరకు..


మృతదేహం వద్ద పడి ఉన్న ఫోన్ ఆధారంగా మృతుడి వివరాలు సేకరించారు. ఫోన్ నెంబర్ ఆధారంగా మృతుడు.. నావంద్గీ గ్రామానికి చెందిన పిట్టల ఎల్లప్ప అని గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించారు. ఎల్లప్ప కుటుంబ సభ్యులు.. మృతదేహం తమ వాడితో అనుకుని ఇంటికి తీసుకెళ్లారు. ఎల్లప్ప చనిపోయిన విషయం బంధుమిత్రులందరికీ సమాచారం అందించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. అయితే నావంద్గి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తాండూరులో ఉండగా.. చనిపోయాడనుకున్న పిట్టల ఎల్లప్ప అతడికి తారసపడ్డాడు.

Viral video: రాత్రివేళల్లో గేదెలు మేయడానికి వీలుగా.. ఈ రైతు చేసిన ఏర్పాట్లు చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


ప్రాణాలతో ఉన్న ఎల్లప్పను చూసి ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి.. దగ్గరికి వెళ్లి అతడిని పలకరించాడు. ‘‘నువ్వు చనిపోయావు అనుకుని ఎవరిదో శవాన్ని తీసుకొచ్చి మీ కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు’’.. అని చెప్పాడు. ఈ మాట విని ఎల్లప్ప కూడా అవాక్కయ్యాడు. చివరకు అదే వ్యక్తితో కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించి తాను బతికి ఉన్నట్లు తెలిపాడు. హుటాహుటిన గ్రామానికి వెళ్లాడు. అప్పటిదాకా చనియాడునుకున్న వ్యక్తి.. ప్రాణాలతో రావడం చూసి గ్రామస్తులంతా షాక్ అయ్యారు. చివరకు ఎల్లప్ప కుటుంబ సభ్యులు వికారాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం అందించి విషయం తెలియజేశారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral video: రోడ్డు దాటుతూ కామెడీ చేస్తున్న ఆవులు.. మధ్యలో తెల్లటి గీతలను చూడగానే..

Updated Date - Jun 23 , 2024 | 07:34 PM

Advertising
Advertising