Viral Video: చిరుతపులితో దొంగా పోలీస్ ఆట.. ఈ కోతి టాలెంట్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN, Publish Date - Aug 29 , 2024 | 09:01 PM

కోతి చేష్టలు చూస్తే కొన్నిసార్లు విసుగు తెప్పించినా.. చూడటానికి మాత్రం అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. సాధారణంగా సర్కస్‌లో వివిధ రకాల విన్యాసాలు చేస్తూ అందరినీ నవ్వించే కోతులను చూస్తుంటాం. కొన్నిసార్లు నిజ జీవితంలోనూ చాలా కోతులు ఇలా ప్రవర్తిస్తండడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి...

Viral Video: చిరుతపులితో దొంగా పోలీస్ ఆట.. ఈ కోతి టాలెంట్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..

కోతి చేష్టలు చూస్తే కొన్నిసార్లు విసుగు తెప్పించినా.. చూడటానికి మాత్రం అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. సాధారణంగా సర్కస్‌లో వివిధ రకాల విన్యాసాలు చేస్తూ అందరినీ నవ్వించే కోతులను చూస్తుంటాం. కొన్నిసార్లు నిజ జీవితంలోనూ చాలా కోతులు ఇలా ప్రవర్తిస్తండడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ కోతి చిరుత పులితో దొంగా పోలీస్ ఆట స్టార్ట్ చేసింది. చెట్టుపై అది చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ చిరుత పులి జంతువులను వేటాడేందుకు వేచి చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలో దానికి ఓ కోతి కనిపిస్తుంది. దాన్ని చూడగానే.. ‘‘ఏ జంతువూ కనిపించలేదు.. ఈ పూటకు.. ఈ కోతిని కానిద్దాం’’.. అని అనుకుంటూ (leopard chasing monkey) దాన్ని వెంబడిస్తుంది. చిరుత పులి వెంటపడగానే కోతి అలర్ట్ అయిపోతుంది. ‘‘నన్ను పట్టుకోవడం అంత సులువు కాదు చిరుతా’’.. అని అనుకుంటూ చూస్తుండగానే ఓ పెద్ద చెట్టు పైకి ఎక్కేస్తుంది. కోతి చెట్టు ఎక్కగానే చిరుత కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా చకచకా చెట్టు ఎక్కేస్తుంది.

Viral Video: వేగంగా వెళ్తూ ఉన్నట్టుండి వరుసగా పడిపోయిన బైకర్లు.. కారణమేంటో తెలిస్తే.. నోరెళ్లబెడతారు..


ఇంత వరకూ బాగానే ఇక్కడే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. చెట్టు ఎక్కిన కోతి.. చివరకు చిటారు కొమ్మల మీదకు వెళ్తుంది. దీంతో అక్కడికి వెళ్లేందుకు సాధ్యం కాక.. చిరుత పులి చెట్టు మొదలు వద్దే నిలబడి వేచి చూస్తుంటుంది. అయితే కోతి అంతటితో ఆగకుండా గేమ్ స్టార్ట్ చేస్తుంది. ‘‘హే చిరుతా.. దమ్ముంటే నన్ను పట్టుకో చూద్దాం’’.. అన్నట్లుగా ఓ కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు జంప్ చేస్తుంది. దీంతో చిరుత పులి కూడా అటూ, ఇటూ కదులుతూ.. కోతి కిందకు వస్తే పట్టుకోవాలని చూస్తుంటుంది. ఈ క్రమంలో కోతి చిటారు కొమ్మలపై అటూ, ఇటూ దూకుతూ పులిని తికమకపెడుతుంది. అది దూకినప్పుడల్లా చిరుత కూడా అటూ ఇటూ కదులుతుంటుంది.

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..


ఇలా చాలా సేపు చిరుత పులితో కోతి ఆటుకుంటుంది. దీంతో చివరకు చిరుత పులి అసలిపోయి.. ‘‘వామ్మో.. ఈ తుంటరి కోతిని పట్టుకోవడం నా వల్ల కాదు బాబోయ్’’.. అనుకుంటూ అలాగే ఉండిపోతుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చిరుతకు చుక్కలు చూపించిన కోతి’’.. అంటూ కొందరు, ‘‘దొంగ పోలీస్ ఆట ఆడుకుందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అరటిగెలే కదా అని చేతులు పెట్టేస్తున్నారా.. కాస్త ఆగి చూడగా.. దిమ్మతిరిగే సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 29 , 2024 | 09:01 PM

Advertising
Advertising