ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పడగెత్తిన కోబ్రా ముందే కోతి వింత చేష్టలు.. మరో పామును మెడలో వేసుకోవడంతో చివరకు..

ABN, Publish Date - Sep 25 , 2024 | 06:49 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కోతి విచిత్ర ప్రవర్తన చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. పక్క పక్కనే ఉన్న రెండు పాములు కోతి కంటపడతాయి. వాటిని చూడగానే కోతికి ఆడుకోవాలని ఇంట్రెస్ట్ పుట్టినట్లుంది. వెంటనే కోతి..

ఎవరైనా పిచ్చి పనులు చేస్తుంటే.. కోతి చేష్టలు చాలు ఇక ఆపండి అంటూ ఉంటాం. అలాంటిది ఇక కోతులే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే.. ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్నిసార్లు కోతుల ప్రవర్తన చూస్తే చికాకు తెప్పిస్తుంటుంది. అలాగే మరికొన్నిసార్లు కోతుల ప్రవర్తన చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పడగెత్తిన కోబ్రా ముందే ఓ కోతి వింతగా ప్రవర్తించింది. పక్కనే ఉన్న మరో పామును మెడలో వేసుకోవడంతో చివరికి ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కోతి (monkey) విచిత్ర ప్రవర్తన చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. పక్క పక్కనే ఉన్న రెండు పాములు కోతి కంటపడతాయి. వాటిని చూడగానే కోతికి ఆడుకోవాలని ఇంట్రెస్ట్ పుట్టినట్లుంది. వెంటనే కోతి.. పాముల వద్దకు వెళ్లి పక్కనే కూర్చుంది. కోతి రావడాన్ని గమనించిన నాగుపాము పడగ విప్పి బుసలు కొట్టింది.

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..


నాగుపాము బుసలు కొడుతున్నా కోతి మాత్రం అదేమీ పట్టించుకోకుండా.. ఆ పక్కనే ఉన్న మరో పామును పట్టుకుని పూల దండలా (monkey wears snake around its neck) మెడలో వేసుకుంది. పామును మెడలో వేసుకోవడం గమనించిన పడగ విప్పిన కోబ్రా.. మరింత షాక్ అవుతుంది. కానీ కోతిని కాటేసే ధైర్యం చేయలేక.. బుసలు కొడుతూ భయపెట్టాలని చూస్తుంది. అయినా కోతి మాత్రం కొంచెం కూడా భయపడకుండా కూల్‌గా పామును మెడలో వేసుకుని ఆడుకుంటుంది. ఇలా చాలా సేపు పాముతో కోతి ఆడుకుంటూ కనిపిస్తుంది.

Viral Video: ఒకే ఒక్క పాప్‌కార్న్ గింజతో మిలియన్ల వ్యూస్.. ఇంతకీ ఈమె చేసిన ప్రయోగం ఏంటో చూడండి..


అయినా నాగు పాము అలా బుసలు కొడుతూనే ఉంటుంది తప్ప కాటు మాత్రం వేయదు. అయితే ఇదంతా చూస్తే కోతిని కావాలనే పాముల వద్దకు పంపించి వీడియో చేసినట్లుగా కనిపిస్తోంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కోతిని చూసి భయపడ్డ నాగుపాము’’.. అంటూ కొందరు, ‘‘కోతిని తాడుతో కట్టి, ఇలా పాములతో ఆడించడం చాలా దారుణం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 30 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పాకిస్థాన్‌లో ఇలాక్కూడా చేస్తారా.. కటింగ్ మిషన్‌తో వీరు చేస్తున్న నిర్వాకం చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 25 , 2024 | 06:49 PM