మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: రాత్రి వేళ ఇలాంటి డ్రస్సులు వేసుకుని రోడ్డుపైకి వెళ్తున్నారా.. అయితే ఈ వీడియో చూడండి..

ABN, Publish Date - Apr 27 , 2024 | 06:55 PM

చాలా వరకు ప్రమాదాలు వాహనదారుల నిర్లక్ష్యంగానే జరుగుతుంటాయి. అయితే కొన్నిసార్లు మనకు తెలీకుండా చేసే పనులు కూడా చివరకు మన ప్రాణాల మీదకు తెస్తుంటాయి. అందులో ప్రధానంగా మనం ధరించే దుస్తులు.. కొన్నిసార్లు..

Viral Video: రాత్రి వేళ ఇలాంటి డ్రస్సులు వేసుకుని రోడ్డుపైకి వెళ్తున్నారా.. అయితే ఈ వీడియో చూడండి..

చాలా వరకు ప్రమాదాలు వాహనదారుల నిర్లక్ష్యంగానే జరుగుతుంటాయి. అయితే కొన్నిసార్లు మనకు తెలీకుండా చేసే పనులు కూడా చివరకు మన ప్రాణాల మీదకు తెస్తుంటాయి. అందులో ప్రధానంగా మనం ధరించే దుస్తులు.. కొన్నిసార్లు మన ప్రాణాలు తీసే ప్రమాదం ఉందని చాలా మందికి తెలీదు. తాజాగా, ఈ రోడ్డు భద్రతకు సంబంధించిన అంశంపై హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డు ప్రమాదాలు జరగడానికి కొన్నిసార్లు మనం వేసుకునే డ్రస్సులు కూడా కారణమవుతాయి. చాలా మందికి ఈ విషయంపై కనీస అవగాహన కూడా ఉండదు. కానీ రాత్రి వేళ రోడ్డుపై జరిగిన కొన్ని ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. రోడ్డుపై వాహనాల రద్దీ సమయంలో కొందరు పాదచారులు రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో ఓ నల్లటి దుస్తులు ధరించిన ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. రోడ్డు మధ్యలో ఓ వాహనం అతన్ని బలంగా ఢీకొంది. అలాగే నల్లటి దుస్తులు ధరించిన మరో వ్యక్తి రోడ్డు దాటే ప్రయత్నం చేస్తాడు.

Puzzle: ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలున్నాయ్.. వాటిని 30 సెకన్లలో గుర్తించారంటే మీరే తోపు..


కారులో వెళ్తున్న వ్యక్తికి అతను అసలు కనిపించడు. తీరా దగ్గరికి వెళ్లగానే ఆ వ్యక్తి కనిపించడంతో సడన్‌గా బ్రేకులు వేస్తాడు. దీంతో అదృష్టవశాత్తు ఆ యువకుడు ప్రాణాలతో బయటపడతాడు. దీన్నిబట్టి చూస్తే నల్లటి దుస్తుల కారణంగా కూడా రాత్రి వేళ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీనిపై హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు (Hyderabad City Traffic Police) ప్రజలు అవగాహన కల్పిస్తూ వీడియో రిలీజ్ చేశారు. అలాగే రాత్రి వేళ్లలో బైకులు, సైకిళ్లలో వెళ్లే వాళ్లు కూడా నల్లటి దుస్తులు ధరిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ రాత్రిళ్లు ప్రయాణం చేసేవారు.. నల్లటి దుస్తులు కాకుండా, తెలుపు తదితర దస్తులు ధరించాలని సూచించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral: వెతక్కుండానే దొరికేశాయోచ్..! వంట గదిలో మట్టి తవ్వుతుండగా.. జంటను వరించిన అదృష్టం..

Updated Date - Apr 27 , 2024 | 06:55 PM

Advertising
Advertising