ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: మెట్రోలో వృద్ధుడి వికృత చేష్టలు.. చిరిగిన యువతి జీన్స్‌ చూసి.. పక్కనే కూర్చుని..

ABN, Publish Date - Jul 06 , 2024 | 05:47 PM

రైలు ప్రయాణాల్లో కొందరు ప్రయాణికులు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తుంటాం. కొందరు తాకరానిచోట తాకుతూ ఇబ్బంది పెడుతుంటే, మరికొందరు వికృతంగా ప్రవర్తిస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి...

రైలు ప్రయాణాల్లో కొందరు ప్రయాణికులు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తుంటాం. కొందరు తాకరానిచోట తాకుతూ ఇబ్బంది పెడుతుంటే, మరికొందరు వికృతంగా ప్రవర్తిస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి ఘటనలు ఢిల్లీ మెట్రో రైళ్లలో ఇటీవల తరచూ చోటు చేసుకోవడం చూస్తున్నాం. ఇలాంటి వీడియోలు కూడా ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వృద్ధుడు మెట్రో రైల్లో యువతి పక్కన కూర్చున్నాడు. ఆమె చిరిగిపోయిన జీన్స్ చూసి అతడు చేసిన నిర్వాకంపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఢిల్లీ మెట్రో రైల్లో (Delhi Metro Rail) జరిగినట్లుగా తెలుస్తోంది. మెట్రో రైలు ఎక్కిన ఓ వృద్ధుడు (old man) .. యువతి పక్కనే కూర్చున్నాడు. అయితే ఈ క్రమంలో ఆమె చిరిగిన జీన్స్ ప్యాంట్ (Young woman ripped jeans) చూడగానే అతడిలోని శాడిస్ట్ నిద్రలేచాడు. యువతి ఎలాంటి అనుమానం రాకుండా ఆమె తొడలపై ప్యాంట్ చిరిగిపోయిన స్థలంలో తాకుతూ వికృత చేష్టలకు (Indecent behavior) పాల్పడ్డాడు. యువతి తన స్నేహితులతో మాట్లాడుతూ అతడి చేష్టలను గమనించలేదు.

Viral Video: పోట్లాడుకుంటూ పట్టాలపైకి వెళ్లిన ఎద్దులు.. అప్పుడే దూసుకొచ్చిన రైలు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..


యువతి గమనించకపోవడాన్ని అలుసుగా తీసుకున్న అతను.. చాలా సేపు ఇలా అసభ్యకరంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. ఎవరూ తనను గమనించలేదులే అనుకని అతను అలాగే వికృత చేష్టలు చేస్తున్నాడు. అయితే అతడికి ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఇదంతా గమనించి, తన ఫోన్‌లో వీడియో తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘అతడిని ఎవరూ అడ్డుకోకపోవడం దారుణం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: యజమానిపై పగ తీర్చుకున్న కుక్క.. వంటింట్లో అది చేసిన పని చూస్తే..

Updated Date - Jul 06 , 2024 | 05:49 PM

Advertising
Advertising
<