ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పామును కొరికిన ఏడాది వయసు పిల్లాడి.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్ ఏంటంటే..

ABN, Publish Date - Aug 21 , 2024 | 08:19 PM

తెలిసి కొందరు తెలీక మరికొందరు పాములతో గేమ్స్ ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్లు కూడా పాము కాటుకు గురై చనిపోవడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

ప్రతీకాత్మక చిత్రం

తెలిసి కొందరు తెలీక మరికొందరు పాములతో గేమ్స్ ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్లు కూడా పాము కాటుకు గురై చనిపోవడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఏడాది వయసున్న బాలుడు ఓ పిల్ల పామును కొరికేశాడు. అయితే చివరకు ఏం జరిగిందో తెలుసుకుని అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బీహార్ (Bihar) గయాలోని ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధి జముహర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంటి టెర్రస్‌పై రియాన్ష్ అనే ఏడాది వయసున్న పిల్లాడు ఆడుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ పిల్ల పాము ఆడుకుంటున్న బాలుడి వద్దకు వచ్చింది.

Viral Video: పామేంటీ ఇలా చేయడమేంటీ.. నోరు తెరచి మరీ ఆశ్చర్యకరంగా..


పిల్ల పామును చూసిన పిల్లాడు.. ఆడుకునే బొమ్మగా భావించి చేతిలోకి తీసుకుని, (child bit the snake) నోటిలో పెట్టుకుని కొరికేశాడు. దీంతో పాము పిల్ల చనిపోయింది. అయితే కాసేపటికి గమనించిన తల్లిదండ్రులు భయంతో పిల్లాడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీంతో వైద్యులు చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే పిల్లాడికి ఎలాంటి ప్రమాదమూ లేదని తెలిపారు. చిన్నారి కొరికిన పాము పిల్ల విషం లేని, వర్షాకాలంలో కనిపించే వానపాము అని తెలిపారు. దీంతో అంతా హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

Viral Video: సిగరెట్ వెలిగించుకోవడానికి.. ఖరీదైన కారును ఎలా వాడుకున్నాడో చూస్తే..


కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చిన్నారికి ఏమీ కాలేదు.. థ్యాంక్స్ గాడ్’’.. అంటూ కొందరు, ‘‘ పిల్లలు ఆడుకునే సమయంలో పెద్దలు పర్యవేక్షిస్తుండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 21 , 2024 | 08:19 PM

Advertising
Advertising
<