Viral video: ఇలాక్కూడా రైలు దిగుతారా.. ఈ మహిళ చేసిన పనికి అవాక్కవుతున్న నెటిజన్లు..

ABN, Publish Date - Jun 26 , 2024 | 04:26 PM

రైలు ప్రయాణాల్లో తెలిసి కొందరు, తెలీక మరికొందరు ప్రమాదాల్లో చిక్కుకుంటారు. ఎక్కువ మంది రైలును ఎక్కి, దిగే క్రమంలోనే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. అయితే కొన్నిసార్లు..

Viral video: ఇలాక్కూడా రైలు దిగుతారా.. ఈ మహిళ చేసిన పనికి అవాక్కవుతున్న నెటిజన్లు..

రైలు ప్రయాణాల్లో తెలిసి కొందరు, తెలీక మరికొందరు ప్రమాదాల్లో చిక్కుకుంటారు. ఎక్కువ మంది రైలును ఎక్కి, దిగే క్రమంలోనే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. అయితే కొన్నిసార్లు కొందరి అదృష్టం బాగుండి ప్రమాదాల నుంచి క్షేమంగా బయటపడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ తన కూతురుతో పాటూ రైలు దిగే పద్ధతిని చూసి అంతా షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన పాకిస్థాన్‌లో (Pakistan) చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ మహిళ (woman) తన కుమార్తెతో పాటూ రైల్లో వెళ్తోంది. అయితే తాను దిగాల్సిన స్టేషన్ వచ్చినా ఆమె గమనించలేదు. తీరా రైలు కదిలే సమయానికి ఈ విషయాన్ని గుర్తించి, తన కుమార్తెతో కలిసి కంగారుగా డోరు వద్దకు వచ్చింది. అయితే అప్పటికే రైలు అక్కడి నుంచి బయలుదేరింది.

Viral video: చూసేందుకు స్కూల్ పిల్లలే అయినా.. రోడ్డుపై ఈ బాలికల నిర్వాకం చూస్తే..


అయినా ఎలాగైనా అదే స్టేషన్‌లో దిగిపోవాలనే ఉద్దేశంతో ముందుగా తన కుమార్తెను దిగమని చెప్పింది. దీంతో బాలిక రైల్లో (moving train) నుంచి కిందకు దూకింది. రైలు వెళ్తున్న దిశగా కాకుండా నేరుగా దూకడంతో బాలిక బ్యాలెన్స్ తప్పి కిందపడబోయింది. అయితే అక్కడే ఉన్న వారు బాలికను పట్టుకోవడం ప్రమాదం తప్పింది. ఆ వెంటనే బాలిక తల్లి కూడా రైల్లో నుంచి ఫ్లాట్‌ఫామ్ మీదకు దూకింది. ఈమె కూడా రైలు వెళ్తున్న దిశగా కాకుండా నేరుగా దూకి నేలపై నిలబడాలని ప్రయత్నించింది.

Viral video: సిమెంట్ మూటను ఇలా ఎవరైనా ఎత్తగలరా.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా..


అయితే బ్యాలెన్స్ తప్పి ధబేల్‌మని (woman falling down on platform) కిందపడిపోయింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పాకిస్థాన్‌లో భౌతికశాస్త్రం బోధించరేమో’’.. అంటూ కొందరు, ‘‘పాపం ఈ మహిళకు రైలు ప్రయాణం కొత్తేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: చిరుత కన్నేస్తే ఇలాగే ఉంటుంది మరి.. నీటిలోని మొసలిని ఎలా వేటాడిందో చూస్తే..

Updated Date - Jun 26 , 2024 | 04:26 PM

Advertising
Advertising