Viral Video: రైతు కొంప ముంచిన రైలు.. ఈ ప్రయాణికులు చేసిన పని చూస్తే..
ABN, Publish Date - Dec 22 , 2024 | 01:39 PM
రైలు ప్రయాణాల్లో కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటే.. మరికొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చివరకు ఇలాంటి ఘటనలన్నీ వీడియోల రూపంలో నెట్టింట్లో సందడి చేస్తుంటాయి. రైలు ప్రయాణాల్లో కొందరు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే.. ఇంకొందరు..
రైలు ప్రయాణాల్లో కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటే.. మరికొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చివరకు ఇలాంటి ఘటనలన్నీ వీడియోల రూపంలో నెట్టింట్లో సందడి చేస్తుంటాయి. రైలు ప్రయాణాల్లో కొందరు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే.. ఇంకొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. తాజాగా, రైలు ప్రయాణికులు మూకుమ్మడిగా చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘రైతు కొంప ముంచారు కదరా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బీహార్‌లో (Bihar) చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏం జరిగిందో ఏమో గానీ.. ఓ రైలు (train) మార్గ మధ్యలో ఆగింది. దీంతో అందులోని ప్రయాణికులంతా కిందకు దిగి సరదాగా గడిపారు. అయితే ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వారు ఉన్న ప్రాంతంలోనే ఓ చెరుకు పొలం (Sugarcane field) కనిపించింది. ఇంకేముందీ.. రైలు దిగిన ప్రయాణికులంతా మూకుమ్మడిగా పొలంలో పడిపోయారు.
ఎవరికి తోచినంత వారు చెరుకు గడలను పీక్కున్నారు. కొందరు అత్యాశతో (Train passengers stole sugar cane) మోపు కట్టి మరీ రైల్లోకి తరలించారు. ఇలా ప్రయాణికులంతా ఆ చెరుకు గడలను పీకేయడంతో ఆ రైతుకు తీవ్ర నష్టం వాటిళ్లినట్లు తెలుస్తోంది. చెరుకు సాగుకు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయని, ఇలా చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Viral Video: చీరలో సింపుల్‌గా ఉన్నా.. టాలెంట్ మామూలుగా లేదుగా.. పామును ఎలా పట్టేసిందో చూడండి..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలా చేయడం మంచి పద్ధతి కాదు’’.. అంటూ కొందరు, ‘‘రైతు కష్టాలను గుర్తించిన వారైతే ఇలా చేయరు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 5.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: కెమెరాను ఎత్తుకెళ్లిన సింహం.. రికార్డైన వీడియో చూస్తే.. షాకవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 22 , 2024 | 01:39 PM