Viral Video: వరదలను ఇలా వాడేసుకున్నారు.. వీళ్ల బిజినెస్ మామూలుగా లేదుగా..
ABN, Publish Date - Apr 17 , 2024 | 04:48 PM
దుబాయ్‌లో వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఏడాది మొత్తం కురవాల్సిన వర్షం.. కొన్ని గంటల వ్యవధిలో కురిసిందిని అధికారులు తెలిపారు. మరోవైపు..
దుబాయ్‌లో వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఏడాది మొత్తం కురవాల్సిన వర్షం.. కొన్ని గంటల వ్యవధిలో కురిసిందిని అధికారులు తెలిపారు. మరోవైపు వరదల దాటికి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా అన్ని పాఠశాలలనూ మూసేశారు. ఇదిలావుండగా, భారీ వర్షాలకు సంబంధించిన అనేక వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సబ్‌వేల వద్ద నిలిచిన వరద నీటిలో కొందరు తెలివిగా వినూత్నం వ్యాపారం స్టార్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘వీళ్ల బిజినెస్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తు్న్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దుబాయ్‌ని భారీ వర్షాలు (Dubai) Heavy rains) అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్లపై ఎక్కడ చూసినా వరద నీరే దర్శనమిస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పాదచారులు రోడ్డు దాటడానికి కూడా కష్టమవుతోంది. ఇదిలావుండగా, కొందరు ఈ వరదలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. భారీ వర్షాల కారణంగా ఓ సబ్‌వేలో వరద నీరు భారీగా నిలిచింది. దీంతో మహిళలు నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Viral Video: వామ్మో..! ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా.. ఆటోలో వెళ్తూ బైకర్‌కు షాకిచ్చిన మహిళ.. చివరకు..
మహిళల ఇబ్బందులను గమనించిన కొందరు షాపింగ్ మాల్స్‌లో వినియోగించే కార్ట్‌లతో వ్యాపారం మొదలెట్టారు. నడవడానికి ఇబ్బంది పడే మహిళల నుంచి కొంత మొత్తాన్ని తీసుుని షాపింగ్ కార్ట్‌లలో కూర్చోబెట్టుకుని అవతలి వైపు దింపేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజనన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వ్యాపారం ఏదో బాగుందే’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వ్యాపారాన్ని బీహార్‌లో కూడా ప్రారంభించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: ఈ జొమాటో డెలివరీ బాయ్ స్పెషాలిటీయే వేరు.. జంక్షన్‌లో అతన్ని చూసి అవాక్కైన వాహనదారులు..
Updated Date - Apr 17 , 2024 | 04:48 PM