ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: గేటు దాటి లోపలికి వెళ్లిన డెలివరీ బాయ్... పెంపుడు కుక్కలే కదా అనుకుంటే.. చివరకు..

ABN, Publish Date - Jul 19 , 2024 | 08:00 PM

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో కుక్కను పెంచుకోవడం అలవాటుగా మారిపోయింది. కొందరైతే వాటిని తమ స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. మరికొందరు లక్షలు ఖర్చు చేసి మరీ వివిధ రకాల జాతులకు చెందిన కుక్కలను కొంటున్నారు. అయితే...

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో కుక్కను పెంచుకోవడం అలవాటుగా మారిపోయింది. కొందరైతే వాటిని తమ స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. మరికొందరు లక్షలు ఖర్చు చేసి మరీ వివిధ రకాల జాతులకు చెందిన కుక్కలను కొంటున్నారు. అయితే ఈ కుక్కల కారణంగా కొన్నిసార్లు పక్కింటి వారు, పాదచారులు ఇబ్బందులు పడుతున్న సందర్భాలను తరచూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆర్డర్ తీసుకుని గేటు దాటి లోపలికి వెళ్లిన డెలివరీ బాయ్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాయ్‌పూర్‌లోని ఖమర్దిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వైద్యుడు.. తమ ఇంట్లో రెండు పిట్ బుల్స్ జాతికి చెందిన కుక్కలను పెంచుతున్నాడు. ఇటీవల ఓ రోజు సల్మాన్ ఖాన్ అనే డెలివరీ బాయ్.. ఆర్డర్ పట్టుకుని వైద్యుడి ఇంటి వద్దకు వచ్చాడు. గేటు తెరిచే ఉండడంతో లోపలికి వెళ్లాడు.

Viral Video: పిల్లతో కలిసి నదిలోకి దిగిన తల్లి ఏనుగు.. సడన్‌గా హిప్పోల రాకతో మారిన సీన్.. చివరకు..


అతను అలా లోపలికి వెళ్లగానే పిట్ బుల్స్ అతడికి ఎదురుగా వచ్చాయి. పెంపుడు కుక్కలే కదా.. ఏమీ అనవులే అని అనుకుని వాటికి దగ్గరగా వెళ్లాడు. అయితే అవి వచ్చీ రాగానే (Delivery boy attacked by pit bulls) అతడిపై దాడికి దిగాయి. సల్మాన్ కాలును పట్టుకుని కొరికేశాయి. చాలా సేపు కాలును వదల్లేదు. దీంతో అతను వాటి నుంచి విడిపించుకోలేక అవస్థలు పడ్డాడు. చివరకు ఎలాగోలా తప్పించుకుని పరుగెత్తుకుంటూ వెళ్లి అక్కడే పార్క్ చేసి ఉన్న కారు పైకి ఎక్కేశాడు. పక్కింటి వారు గట్టిగా కేకలు వేయడంతో సదరు ఇంటి యజమానురాలు పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చి కుక్కలను పక్కకు తోలింది.

Viral Video: డాన్సర్ పైశాసికత్వం.. వేదికపై కోడిని పట్టుకుని అతడు చేసిన నిర్వాకం..


అయితే అప్పటికే డెలివరీ బాయ్ కాలికి తీవ్ర రక్తస్రావమైంది. నొప్పి తాళలేక కాలు పట్టుకుని గట్టిగా కేకలు వేశాడు. చివరకు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పిట్ బుల్స్ సహా అనేక ప్రమాదకరమైన జాతుల కుక్కల విక్రయాలపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినా సదరు వైద్యుడు పిట్ బుల్స్‌ను పెంచుకోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడికి నష్టపరిహారం అందిచండంతో పాటూ సదరు వైద్యడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Viral Video: సింహాలను మేతకు తోలుకెళ్లిన వ్యక్తి.. చివరకు అక్కడ జరిగింది చూసి ఖంగుతిన్న జనం..

Updated Date - Jul 19 , 2024 | 08:00 PM

Advertising
Advertising
<