ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

ABN, Publish Date - Sep 01 , 2024 | 06:42 PM

ఇళ్లు, వాటర్ ట్యాంకులు, బావులు తదితర ప్రదేశాల్లో వింత వింత శబ్ధాలు రావడం, ఏముందా అని చూస్తే షాకింగ్ సీన్లు కనిపించడం చూస్తుంటాం. కొన్నిసార్లు మరీ విచిత్రంగా ఏవోవే వింత వింత జీవులు కనిపిస్తుంటాయి. ఇలాంటి అనూహ్య ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

ఇళ్లు, వాటర్ ట్యాంకులు, బావులు తదితర ప్రదేశాల్లో వింత వింత శబ్ధాలు రావడం, ఏముందా అని చూస్తే షాకింగ్ సీన్లు కనిపించడం చూస్తుంటాం. కొన్నిసార్లు మరీ విచిత్రంగా ఏవోవే వింత వింత జీవులు కనిపిస్తుంటాయి. ఇలాంటి అనూహ్య ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బావి నుంచి ఏకదాటిగా శబ్ధాలు వస్తుడడంతో గ్రామస్తులు అనుమానం వచ్చింది. చివరకు అందులో ఏముందా అని చూడగా.. షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) ఇటావా తహసీల్ చకర్‌నగర్ ప్రాంతంలోని పాలి గోపాల్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలోని ఓ బావిలో కొన్ని రోజులుగా వింత శబ్ధాలు వస్తూ ఉండేవి. అయినా గ్రామస్తులు మొదట్లో పట్టించుకునేవారు కాదు. అయితే రోజూ ఇలాగే శబ్ధాలు వస్తుండడంతో అందరికీ అనుమానం వచ్చింది. అందులో ఏముందో తెలుసుకోవాలని ఓ రోజు అంతా కలిసి వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లి చూశారు.

Viral Video: ఎలుగుబంటికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. పులిని ఎలా హడలెత్తించిందో చూస్తే..


బావిలో ఏముందా.. అని చూడగా లోపల ఏకంగా చాలా (Pythons in well) కొండ చిలువలు కనిపించాయి. దీంతో అంతా భయంతో అక్కడి నుంచి పారిపోయారు. చివరకు సమాచారం అందుకున్న రెస్క్యూ టీం అక్కడికి చేరుకుని పరిశీలించింది. బావి లోతుగా ఉండడంతో ఎంతో సేపు శ్రమించి, చివరకు వాటిని ఎలాగోలా బయటికి తీశారు. మొత్తం 24 పిల్ల కొండచిలువలు, ఒక విషసర్పాన్ని సురక్షితంగా బయటికి తీశారు. తర్వాత వాటిని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఒకే ప్రాంతంలో ఇన్ని కొండచిలువలు కనిపించడం ఈ ప్రాంతంలో ఇదే మొదటిసారి అని రెస్క్యూ టీం సభ్యులు తెలిపారు.

Viral Video: ఈ ఏనుగుకు హెల్పింగ్ నేచర్ ఎక్కువే.. హిప్పోను ప్రమాదం నుంచి ఎలా కాపాడిందో చూడండి..


ఇలా గుట్టలు గుట్టలుగా పాములు కనిపించడంతో గ్రామస్తులు పొలాల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. రాత్రి వేళల్లో ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలన్నా భయంగా ఉందని చెబుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇన్ని కొండచిలువలు అక్కడికి ఎలా వెళ్లాయ్’’.. అంటూ కొందరు, ‘‘పొలాల్లో పని చేసే సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Optical illusion: మీ కంటి చూపు బాగుందో లేదో చెక్ చేసుకోండి.. ఈ వృత్తం వెనుకున్న సంఖ్య ఏంటో 10 సెకన్లలో చెప్పగలరా..?


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 01 , 2024 | 06:42 PM

Advertising
Advertising