ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: చూస్తుండగానే మాయమైన రోడ్డు.. దడ పుట్టిస్తున్న 52 సెకన్ల వీడియో..

ABN, Publish Date - Aug 06 , 2024 | 07:46 AM

ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక కేరళ వంటి రాష్ట్రంలో అయితే ఊళ్లకు ఊళ్లే వరద నీటిలో కొట్టుకుపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం కూడా చూశాం. ఇలాంటి సమయాల్లో కొండ ప్రాంతాల్లో షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా...

ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక కేరళ వంటి రాష్ట్రంలో అయితే ఊళ్లకు ఊళ్లే వరద నీటిలో కొట్టుకుపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం కూడా చూశాం. ఇలాంటి సమయాల్లో కొండ ప్రాంతాల్లో షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ రోడ్డు చూస్తుండగానే మాయమైంది. 52 సెకన్ల ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. అసలేమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొండ ప్రాంతంలోని రోడ్డు వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఓ ప్రాంతంలో కొండలో సొరంగ మార్గంలో వాహనదారులు చూస్తుండగానే (Collapsed road) రోడ్డు కూలిపోయింది. రోడ్డు చివర భాగం కూలిపోవడంతో కొందరు తమ వాహనాలను రోడ్డు పక్కన ఆపి వీడియోలు తీస్తున్నారు.

Viral Video: ఆకలితో ఉన్న మొసళ్లు ఇలాక్కూడా చేస్తాయా.. గూస్‌బమ్స్ తెప్పిస్తున్న వీడియో..


ఇలా వాహనదారులు చూస్తుండగానే రోడ్డు ఓ వైపు నుంచి మరో వైపునకు మొత్తం కూలిపోయింది. ఈ ఘటనతో ఎదురుగా వస్తున్న మరికొన్ని వాహనాలు దూరంగా ఆగిపోయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని కలగనట్లు తెలుస్తోంది. కొండచరియలు విరిగిపడడంతోనే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన టర్కీలో (Turkey) ఏడాది క్రితం భారీ వర్షాల (Heavy rains) కారణంగా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Viral Video: అయ్యో.. ఇలా జరిగిందేంటీ.. ఎస్కలేటర్ ఎక్కుతుండగా.. ఈ మహిళల ఇబ్బందులు చూస్తే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో చూస్తుంటేనే బయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: పట్టుకునే క్రమంలో కాటేసింది.. చికిత్స తీసుకుని వచ్చి కోబ్రాను చూడగా.. షాకింగ్ సీన్..

Updated Date - Aug 06 , 2024 | 07:46 AM

Advertising
Advertising
<