ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

ABN, Publish Date - Dec 25 , 2024 | 09:51 PM

Watch video: పులులు, సింహాల వేటకు సంబంధించిన అనేక వీడియోలను నిత్యం చూస్తుంటాం. పెద్ద పెద్ద జంతువులను సైతం ఎంతో అవలీలగా వేటాడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. కొన్నిసార్లు అవి వేలాడే తీరు చూస్తే ఒళ్లు జలదరించేలా ఉంటుంది. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పులి ఆవుపై దాడి చేసింది..

Tiger Attack on Cow

పులులు, సింహాల వేటకు సంబంధించిన అనేక వీడియోలను నిత్యం చూస్తుంటాం. పెద్ద పెద్ద జంతువులను సైతం ఎంతో అవలీలగా వేటాడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. కొన్నిసార్లు అవి వేలాడే తీరు చూస్తే ఒళ్లు జలదరించేలా ఉంటుంది. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పులి ఆవుపై దాడి చేసింది. పర్యాటకులంతా చూస్తుండగానే ఆవును అడవిలోకి లాక్కెళ్లిపోయింది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వామ్మో్.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్ర (Maharashtra) తడోబా అంధారి టైగర్ ప్రాజెక్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పర్యాటకులంతా వాహనాల్లో అడవి జంతువులను చూడటానికి వెళ్తుండగా.. ఓ పెద్ద పులి నడుస్తూ వెళ్తుంటుంది. దీంతో పర్యాటకులు తమ వాహనాలను ఆపుకొని చూస్తుంటారు. ఇంతలో ఓ ఆవు కూడా రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటుంది.

Viral Video: ఇదెక్కడికి విడ్డూరంరా బాబోయ్.. పెట్రోల్ బంకులో చలిమంట.. వీళ్ల నిర్వాకం చూస్తే షాకవ్వాల్సిందే..


అప్పటికే ఆకలితో ఉన్న ఆ పులి.. ఆవును చూడగానే టార్గెట్ ఫిక్స్ చేస్తుంది. ఆవు వెనుకే వేగంగా వెళ్లి సమీపానికి వెళ్లగానే (Tiger attack on cow) ఒక్కసారిగా దానిపై దాడి చేస్తుంది. పులి సడన్‌గా దాడి చేయడంతో ఆవు ఉక్కిరిబిక్కిరవుతుంది. ఎలాగైనా పులి నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. అయితే పులి మాత్రం ఆవు మెడ పట్టుకుని ఊపిరాడకుండా చేస్తుంది. చివరకు ఆవును కింద పడేసి ఈడ్చుకుంటూ అడవిలోకి వెళ్లిపోతుంది. ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరుగుతుంది.

Viral Video: ఏందిరయ్యా ఇదీ..! విమానం అనుకున్నావా.. రైలు బోగీ అనుకున్నావా.. ఇతనేం చేస్తున్నాడో చూడండి..


కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ పులి వేట ఎంతో భయంకరంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఆవును చూస్తుంటే ఎంతో బాధగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 వేలకు పైగా లైక్‌లు, 6 లక్షలకు పైగా వ్యూ్స్‌‌ను సొంతం చేసుకుంది.

Viral Video: దారి మధ్యలో ప్రేమ జంట.. వెనుకే నిలబడ్డ పెంగ్విన్.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 25 , 2024 | 09:54 PM