ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేస్తున్నారా.. ఇలాంటి పరిస్థితి మీకూ రావొచ్చు.. ఇతడికేమైందో చూస్తే..

ABN, Publish Date - Jul 27 , 2024 | 07:33 PM

బస్సు, రైలు ప్రయాణాల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నా.. చాలా మందిలో మార్పు రావడం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు, త్వరగా గమ్యస్థానానికి చేరుకోవాలని మరికొందరు ప్రమాదకరంగా ప్రయాణం చేస్తూ..

బస్సు, రైలు ప్రయాణాల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నా.. చాలా మందిలో మార్పు రావడం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు, త్వరగా గమ్యస్థానానికి చేరుకోవాలని మరికొందరు ప్రమాదకరంగా ప్రయాణం చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు రైల్లో ప్రమాదకరంగా ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో ప్రస్తుతం (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ముంబైలో (Mumbai) ఈ ఘటన చోటు చేసుకుంది. లోకల్ ట్రైన్ (Local train) నగరంలోని థానే నుంచి దాదర్ వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జాకీర్ హుస్సేన్ అనే యువకుడు అదే ట్రైన్‌కి వెళ్లాలని వచ్చాడు. అయితే అప్పటికే రైల్లో జనం రద్దీగా ఉన్నారు. కాలు తీసి కాలు పెట్టలేని విధంగా ఉంది. డోరు వద్ద చాలా మంది వేలాడుతూ ఉన్నారు. అయినా సదరు యువకుడు అదే రైలు ఎక్కాడు.

Viral Video: రోడ్డు మధ్యలో మహిళ వింత నిర్వాకం.. తాంత్రిక పూజలు చేస్తూ.. అంతా చూస్తుండగానే..


ఫుట్‌బోర్డ్ వద్ద మిగతా వారితో పాటూ ఇతను కూడా వేలాడుతూ ప్రయాణించాడు. అయితే మార్గ మధ్యలో అటూ, ఇటూ చేతులూ ఉపుతూ ఉండగా.. ప్రమాదవశాత్తు చేతులు స్తంభానికి (man fell from the train footboard) తాకి ధబేల్‌మని కిందపడ్డాడు. దీంతో రైల్లోని వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ ఘటనలో సదరు యువకుడు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఈ ఘటనను మరో ట్రైన్‌లో వెళ్తున్న వారు ఫోన్లలో రికార్డ్ చేశారు.

Viral Video: కోతితో పిల్లాడి ఫైట్.. జుట్టూ జుట్టూ పట్టుకుని మరీ కొట్టుకుని.. చివరకు..


ముంబైలోని లోకల్ రైళ్లలో రద్దీ కారణంగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని, ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు కోరుతున్నారు. కాగా, మరోవైపు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తెలిసి తెలిసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు’’.. అంటూ కొందరు, ‘‘ఫుట్‌బోర్డు ప్రయాణం ప్రమాదకరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కాలువలో కొట్టుకుపోతున్న స్నేహితుడిని.. చివరకు చిన్న ట్రిక్‌తో రెప్పపాటులో ఇలా..

Updated Date - Jul 27 , 2024 | 07:33 PM

Advertising
Advertising
<