ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: హాస్టళ్లలో ఇలాంటి సమస్య కూడా రావొచ్చు.. పాపం..! ఇతడి పరిస్థితి ఏమైందంటే..

ABN, Publish Date - Apr 23 , 2024 | 06:25 PM

ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదారూ.. అని ఓ సినీ కవి అన్నట్లు.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అప్పటి వరకూ సంతోషంగా ఉన్న వారు అనుకోని ఘటనలు చోటు చేసుకోవడం ద్వారా మృత్యు ఒడిలోకి జారుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి...

ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదారూ.. అని ఓ సినీ కవి అన్నట్లు.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అప్పటి వరకూ సంతోషంగా ఉన్న వారు అనుకోని ఘటనలు చోటు చేసుకోవడం ద్వారా మృత్యు ఒడిలోకి జారుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి విషాద ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, హైదరాబాద్ నగంరంలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. హాళ్లల్లో ఉంటున్న ఓ వ్యక్తి.. ఉన్నట్టుండి మృత్యువాత పడ్డాడు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అయ్యో.. పాపం..! ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ అక్మల్ సుఫుయాన్ (25) అనే యువకుడు హైదరాబాద్‌లో (Hyderabad) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తుండేవాడు. గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లో ఉన్న షణ్ముఖ హాస్టల్లో ఉండేవాడు. ఇదిలావుండగా, ఆదివారం ఉదయం అతను పని మీద బయటికి వెళ్లాడు. సాయంత్రం తిరిగి హాస్టల్‌కి వచ్చే క్రమంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. గేటు తీసి లోపలికి వచ్చిన అతను.. నేలపై తెరచి ఉన్న సంపును గమనించకుండా అడుగు పెట్టాడు. దీంతో ఒక్కసారిగా అందులో పడిపోయాడు. అదే సమయంలో అటు పక్కనే ఉన్న హాస్టల్ యజమాని.. తన భార్యా, పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు. యువకుడు సంపులో పడిన శబ్ధం విని పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు.

Viral Video: డ్రైవర్ ఎంతకీ కిందకు దిగకపోవడంతో అనుమానం.. ఏమైందా అని లోపల చూడగా..

సంపులో పడిపోయిన యువకుడిని కాపాడేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించాడు. అయినా అతడి ఒక్కడి వల్ల సాధ్యం కాలేదు. చివరకు అంతా అలిసి ఎలాగోలా అతన్ని బయటికి తీసి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీని పరిశీలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి యువకుడి మరణానికి కారణమైన హాస్టల్ యజమానిపై కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అయ్యో.. పాపం..! ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం బలైంది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి హాస్టళ్ల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Optical illusion: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును.. 10 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..

Updated Date - Apr 23 , 2024 | 06:27 PM

Advertising
Advertising