ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ప్లాట్‌ఫామ్‌పై రీల్ చేస్తున్న యువకుడు.. అప్పుడే రైలు దిగుతున్న వృద్ధుడు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

ABN, Publish Date - Sep 06 , 2024 | 08:11 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు సినిమా సీన్ తరహాలో రీల్ చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం రైల్వే ప్లాట్‌ఫామ్‌పై రైలు వస్తుండగా పక్కనే డాన్స్ చేయాలని ప్లాన్ చేశాడు. ఇందుకు తగ్గట్టుగానే రైల్వే ప్లాట్‌ఫామ్‌ పైకి వెళ్లి తీరా రైలు కదిలే సమయంలో..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పని చేయడానికి బద్ధకించే వారు ఉంటారు గానీ.. రీల్స్ చేయడంలో నిర్లక్ష్యం వహించే వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పిల్లల నుంచి పెద్దలు చివరకు వృద్ధుల వరకూ చాలా మంది రీల్స్ చేయడం దినచర్యగా మార్చుకున్నారు. కొందరు వ్యూస్ కోసం ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. ప్రధానంగా రైళ్లు, ప్లాట్‌ఫామ్‌లు.. ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రాంక్‌లు, డాన్స్‌లు చేస్తూ ప్రయాణికులకు చికాకు తెప్పిస్తుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, ఓ యువకుడు ప్లాట్‌ఫామ్‌పై రీల్ చేయడం ఓ వృద్ధుడికి సాయంగా మారింది. ప్లాట్‌ఫామ్‌పై యువకుడు డాన్స్ చేస్తుండగా.. అదే సమయంలో ఓ వృద్ధుడు రైలు దిగుతున్నాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు సినిమా సీన్ తరహాలో రీల్ చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం రైల్వే ప్లాట్‌ఫామ్‌పై రైలు వస్తుండగా పక్కనే డాన్స్ చేయాలని ప్లాన్ చేశాడు. ఇందుకు తగ్గట్టుగానే రైల్వే ప్లాట్‌ఫామ్‌ పైకి వెళ్లి తీరా (young man dancing on railway platform) రైలు కదిలే సమయంలో డాన్స్ చేయడం మొదలెట్టాడు.

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. మొత్తానికి గుర్రం లేకుండానే నడిపించాడుగా..


ఒక వైపు రైలు కదులుతుండగా.. మరో వైపు ఇతను డాన్స్ చేస్తున్నాడు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధుడు కదులుతున్న రైల్లో నుంచి దిగేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలో అదుపు తప్పి సరిగ్గా యువకుడు డాన్స్ చేసే స్థలంలో ముందు వైపు పడ్డాడు. వృద్ధుడు కిందపడడాన్ని గమనించిన (young man saved the old man) ఆ యువకుడు వెంటనే అతన్ని పట్టుకున్నాడు. లేదంటే వృద్ధుడు ప్లాట్‌ఫామ్‌కు, పట్టాల మధ్యలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉండేది.

Viral Video: వెల్లుల్లిని ఒలిచేందుకు ఇబ్బంది పడుతున్నారా.. వీళ్లు వాడిన ట్రిక్ చూస్తే..


ఇలా యువకుడు రీల్స్ చేస్తూ చివరకు వృద్ధుడి ప్రాణాలను కాపాడాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువకుడు ఆ సమయంలో రీల్స్ చేయడం మంచిదైంది’’.. అంటూ కొందరు, ‘‘నిజంగా ఇతడు ఎంతో గొప్ప పని చేశాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. ఒళ్లు జలదరించే సీన్.. మూడు పాములను మింగిన కింగ్ కోబ్రా.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 06 , 2024 | 08:12 PM

Advertising
Advertising