ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: బైకుపై వెళ్తూ వినూత్నంగా రీల్ చేయాలనుకున్నారు.. వేగంగా వెళ్తూ మధ్యలో వెనుక్కు తిరిగి చూడగా..

ABN, Publish Date - Aug 14 , 2024 | 08:31 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది యువకులు తెలిసి తెలిసి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. వ్యూస్, లైక్‌ల కోసం వినూత్నంగా రీల్స్ చేయాలని ప్రయత్నిస్తూ చివరకు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది యువకులు తెలిసి తెలిసి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. వ్యూస్, లైక్‌ల కోసం వినూత్నంగా రీల్స్ చేయాలని ప్రయత్నిస్తూ చివరకు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కొందరు యువకులు బైకుపై వెళ్తూ వినూత్నంగా రీల్ చేయాలని అనుకున్నారు. అయితే రోడ్డుపై వేగంగా వెళ్తూ వెనుక్క తిరిగి చూడగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మీరట్-పౌరీ హైవేపై చోటు చేసుకుంది. కొందరు యువకులు బైకుపై వెళ్తూ వినూత్నంగా రీల్స్ చేసి.. వ్యూస్, లైక్‌లు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం రెండు బైకుల్లో రోడ్డుపైకి వెళ్లారు. ముందు బైకులో ఇద్దరు యువకులు వెళ్తుండగా.. వారిని వెనుక మరో బైకులో కొందరు అనుసరిస్తూ వీడియో తీస్తూ వెళ్లారు. వెనుక బైకులో ఉన్న వారు కెమెరా ఆన్ చేయగానే ముందు బైకులో వెళ్తున్న వారు స్పీడ్ పెంచారు.

Viral Video: కోతి ముందు పిల్ల చేష్టలు చేస్తే.. ఇలాగే ఉంటుంది మరి.. ఈ బాలిక పరిస్థితి చూస్తే..


ఈ క్రమంలో రోడ్డుపై అటూ, ఇటూ వెళ్తూ ర్యాష్ డ్రైవింగ్ చేశారు. ఇలా చివరకు బైకును రోడ్డుకు ఓ వైపు నుంచి మరో వైపునకు మళ్లించారు. అయితే ఇలా మళ్లించే క్రమంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. బైకును రోడ్డుకు అవతలి వైపునకు మళ్లించే క్రమంలో వెనక్కు తిరిగి చూడగా.. వేగంగా వస్తున్న ఓ కారు అప్పటికే సమీపానికి వచ్చేసింది. దీంతో వారు కంగారుపడి దాన్ని తప్పించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ కారు అప్పటికే సమీపానికి రావడంతో (car that hit a bike) వారిని ఢీకొట్టి వెళ్లిపోయింది.

Viral Video: వీరి తెలివి తెల్లారిపోనూ.. సబ్బు చోరీ కాకుండా వీళ్లు చేసిన నిర్వాకం చూస్తే..


ఈ ఘటనలో బైకుపై ఉన్న వారు ఎగిరి దూరంగా పడిపోయారు. చుట్టు పక్కల వారు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో వారు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలతో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. సదరు యువకులు బిజ్నోర్ గ్రామానికి చెందిన సమర్, నౌమాన్ అని తెలిసింది. కాగా, ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రోడ్డుపై ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రమాదకర విన్యాసాలను ఎవరూ చేయొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: నరాలు తెగే ఉత్కంఠ.. సింహం, కుక్కల పోటాపోటీ.. సడన్‌గా తెరుచుకున్న గేట్.. చివరకు..

Updated Date - Aug 14 , 2024 | 08:32 PM

Advertising
Advertising
<